21 July, 2026 | 4:25 AM

స్నేహితుడి ఇంటి వరండాలో ఉరివేసుకుని ఆత్మహత్య

20-07-2026 10:51 AM

రాజోలి మండల కేంద్రంలో ఘటన 

అలంపూర్, జూలై 20: జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) రాజోలి మండలంలో సోమవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి తన స్నేహితుడు గోపి ఇంటికి ఆదివారం రాత్రి వచ్చినట్లు సమాచారం.సోమవారం తెల్లవారుజామున గోపి ఇంటి బయట వరండాలో చీరతో పైపుకు ఉరివేసుకుని సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.సత్యనారాయణ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులను విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఘటన రాజోలి ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకునేలా చేసింది.