21 July, 2026 | 4:40 AM

వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు

20-07-2026 11:47 AM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో అధిక వడ్డీ వ్యాపారుల ఇళ్ల పై పోలీసుల ఆకస్మిక తనిఖీలు(Police raids) చేపట్టారు. ఏకకాలంలో పలుచోట్ల సోదాలు నిర్వహిస్తున్న పోలీసులు. భారీ మొత్తంలో ప్రామిసరీ నోట్లు, చెక్కులు, స్టాంప్ పేపర్లు స్వాధీనం. అప్పులకు సంబంధించిన డాక్యుమెంట్లు, లెక్కల పుస్తకాలు, రికార్డులు, నగదు లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాలు లభించినట్లు సమాచారం. బాధితుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో సోదాలు చేపట్టిన పోలీసులు. అధిక వడ్డీ వ్యాపారంపై పూర్తి వివరాలు కొనసాగిస్తున్న పోలీసులు. అధికారికంగా వివరాలు వెల్లడించాల్సి ఉంది.