15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

నిందితులను ఉరి తీయాలి

24-02-2026 12:36 AM

బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్

ముషీరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): కుమ్మెర ఘటనలో నిందితులను ఉరితీయాలని బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్‌గౌడ్ డిమాండ్ చేశారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్‌తో పాటు సభ్యులను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా విక్రమ్‌గౌడ్ మాట్లాడుతూ..

కుమ్మెర గ్రామంలో అగ్రకుల అహంకారంతో సర్పంచ్ తుకారాంరెడ్డి, సతీష్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఇతర సభ్యులతో కలిసి దాడి చేసి, రెండు నెలల పసికందు మృతికి కారణమయ్యారన్నారు. ఇలాంటి నరరూప రాక్షసులను ఉరి తీయాలన్నారు.  బాధిత కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లింగం, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈడిగ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.