24-02-2026 12:34:25 AM
హైడ్రా ఏకపక్ష నిర్ణయాలతో పేదలను రోడ్డుపాలు
పెద్దలకు ఆస్తులు కూడబెట్టడమేనా హైడ్రా అధికారుల పని
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్‌పల్లి, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొ ని పేదలను రోడ్డుపాలు చేస్తున్నారని, ప్రభుత్వ భూములను రూ.౩ లక్షల కోట్ల కాపాడమని చెప్పుకునే హైడ్రా కమిషనర్ రంగనాథ్.. సున్నం చెరువులో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని కూడా చెరువులో కలిపి ఫెన్సింగ్ వేయాలని కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు సున్నం చెరువులో కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జాలు చేస్తున్నారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన కాలని అసోసియేషన్ సభ్యులు సున్నం చెరువును సోమవారం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,మాజీ కార్పొరేటర్ సభిహ గౌసుద్దిన్‌తో కలిసి అభివృధి పనులను పరిశీలిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సున్నం చెరువులో ఉన్న భూమిని కబ్జాదారులకు వదిలేసి ఫెన్సిం గ్ వేస్తున్న హైడ్రాధికారులు.ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పెద్దలు అప్పగించే ధోరణిలో హైడ్రాధికారుల పని తీరు బాగోలేదని అసహనం వ్యక్తం చేశారు.
రంగనాథ్ స్పందించడం లేదు
అల్లాపూర్ సర్వేనెంబర్ 30లో ఉన్న ప్రభుత్వ భూమిని ఇరిగేషన్, జీహెచ్‌ఎం సీ ప్రభుత్వ అధికారులే 47 లక్షలతో ఫెన్సింగ్ వేశారు.అదే ప్రభుత్వ అధికారులు వేసిన ఫినిషింగ్‌ను తీసివేసి.. మళ్లీ హైడ్రాధికారులు కాంగ్రెస్ నేతలకు కోట్ల రూపాయల విలువ చేసే భూములను అప్పగించి కొత్త ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంలో ఆంతర్యం ఏమిటి?.. బిఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాయకులు సమయం అడిగితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించడం లేదని, హైదరాబాద్ లోని చెరువులను కుంటలను అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం మునిసిపల్ మంత్రి గా కేటిఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి చేశారు.
గత ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియనీయకుండా లైట్లను సైతం వెలగకుంట చేస్తున్నారు అధికారులు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఇబ్బందులు గురి చేయడంమేనా రేవంత్ రెడ్డి సర్కార్ పనితనం. 2017లో ప్రభుత్వ భూమిని రక్షించా లని అధికారులు పెన్సింగ్ వేశారని, కాంగ్రెస్ పార్టీ నేతలు కన్నేసి అధికారులను అడ్డంపెట్టుకొని కబ్జాలు దర్జాగా చేస్తున్నారని ఆరోపిం చారు.
పేదల ఇండ్లను కూల్చివేయడం పెద్దలకు ఆస్తులు కూడబెట్టడమేనా హైడ్రా అధికారుల పని అని.. మూసీ నదిపై గాంధీ విగ్రహాన్ని కట్టడం కోసం 498 ఇండ్లను కూల్చేస్తారా...? అని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట గాంధీ విగ్రహాన్ని నిర్మిస్తే ఏమవుతుంది ఆయన అన్నారు.
సున్నం చెరువులో కాంగ్రెస్ పార్టీ నేతలు కబ్జాలు చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. కాంగ్రెస్ నేతలు కబ్జాలు చేస్తే దానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ మద్దతు పలికితే బిఆర్‌ఎస్ పార్టీ సహించదు. ఒకవేళహైడ్రా కమిష నర్ స్పందించకపోతే హైకోర్టుకైనా సుప్రీంకోర్టుకైనా వెళ్లి ప్రభుత్వ భూములను కాపాడు తామని, ప్రజలకు అంకితం చేస్తాం ఎమ్మెల్యే మాధవరం స్పష్టం చేశారు.