5 April, 2026 | 6:06 AM

బంగ్లా బోర్డు కాళ్ల బేరం

05-04-2026 01:40 AM

ఢాకా, ఏప్రిల్ 4 : ఐపీఎల్ నుంచి ముస్తఫిజుర్‌ను తొలగించినందుకు టీ20 ప్రపం చకప్‌కు ముందు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్ క్రికెట్ బోర్డు అండ చూసుకుని రెచ్చిపోయి బీసీసీఐతో కయ్యానికి కాలు దువ్వింది. తీరా ఇప్పు డు మళ్లీ కాళ్లబేరానికొచ్చింది. అన్నీ మరచిపోయి మాతో క్రికెట్ ఆడండంటూ భారత్ ను బతిమిలాడుకుంటోంది.బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ నజ్ముల్ ఫాహీమ్ తాజాగా బీసీసీఐకి ఒక లేఖ రాశారు.

తమ దేశంలో క్రికెట్ ఆడాలంటూ ఆహ్వానించారు. అదేవిధంగా ఇరు దేశాల మధ్య మళ్లీ క్రికెట్ సం బంధాలు కొనసాగించాలని ఆయన కోరా రు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో వచ్చిన మార్పు లు కూడా దీనికి ఒక కారణంగా కనిపిస్తోం ది. బీసీబీ లేఖ రాసిన విషయాన్ని బీసీసీఐ అధికారి ఒకరు ధ్రువీకరించారు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం అనుమతి లేకుండా బంగ్లాదేశ్‌తో ఎటువంటి ద్వైపాక్షిక సిరీస్ ఆడడం సాధ్యం కాదని బోర్డు వర్గాలు తెలిపాయి. గత కొంతకాలంగా భారత్ మధ్య సంబంధాలు సరిగాలేవు.