15 May, 2026 | 3:00 AM

జనగణన సర్వే పకడ్బందీగా నిర్వహించాలి

15-05-2026 01:44 AM

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్ రామ్ రెడ్డి

ఎల్లారెడ్డి, మే 14 (విజయక్రాంతి): జనగణన సర్వే పగడ్బందీగా నిర్వహించాలని ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రజిత వెంకటరామిరెడ్డి అన్నారు. గురువారం జంగమయిపల్లిలో ఏన్యుమనేటర్లకు వివరాలు అందించారు. ప్రభుత్వం ప్రతి అన్యుమనేటర్ కు ప్రత్యేక గుర్తింపు కార్డు జారీ చేసిందన్నారు. ప్రజలు వివరాలు చెప్పేముందు ఎనిమినేటర్ గుర్తింపు కార్డును పరిశీలించి వివరాలు చెప్పాలన్నారు. జనగణనకు వచ్చేవారు నిజమైన అధికారులైన అని నిర్ధారించుకోవడం తప్పనిసరి అని పేర్కొన్నారు.