2 March, 2026 | 4:07 AM

ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర

02-03-2026 12:41 AM

కేకేసి రాష్ట్ర వైస్ చైర్మన్ దుగ్యాల వేణు 

చారకొండ,మార్చి 1:- గ్రామీణ ప్రాంతాల్లో కూలీలు, పేదలకు 100 రోజుల పని దినాలు కల్పించి వలసలను నివారించేందుకు గత యూపీఏ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతుందని అఖిల్ భారత అసంఘటిత కార్మిక (కేకేసి) రాష్ట్ర వైస్ చైర్మన్ దుగ్యాల వేణు, రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజశేఖర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండె వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జమ్మికింది బాలరాం గౌడ్ లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఉపాధి కూలీలకు సంబంధించిన సదస్సు వాల్ పోస్టర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ కూ లీలు, పేదలకు వ్యవసాయదారిత కుటుంబాలకు ఉపాధిని దెబ్బతీసేలా జాతీయ గ్రామీణ ఉ పాధి హామీ పథకాన్ని వి బి జి రాంజీ గా మార్చి జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారని రాజ్యాంగబద్ధంగా పని హక్కులను తిరిగి అమలు చేయాలని అన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో కేకేసి హైదరాబాద్ జాయింట్ సహాయ కార్యదర్శి బాలకోటి, రుద్రాక్ష మల్లేష్, రూప్ సింగ్, కావలి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.