12 March, 2026 | 10:41 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

అనుమానాస్పద మృతిపై విచారణ వేగవంతం చేయాలి

02-03-2026 12:42 AM

ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్, మార్చి 1 (విజయక్రాంతి)నాగర్ కర్నూల్ జిల్లా పాలెం గ్రామంలో మూడు నెలల చిన్నారి అనుమానాస్పదంగా నీటి తొట్టిలో వేసి హత్య చేసిన దారుణ ఘటనపై ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి స్పందించారు. ఘటనపై వేగవంతంగా విచారణ పూర్తి చేసి నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం పాలెం గ్రామాన్ని సందర్శించిన వారు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. చిన్నారి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఇటీవలి కాలంలో చిన్నారులపై జరుగుతున్న దారుణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించి నిందితులను త్వరగా పట్టుకుని చట్టపరమైన కఠిన శిక్షలు విధించాలని పోలీస్ శాఖకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తుందని తెలిపారు.