అలివి వలల వేటపై రగడ
02-03-2026 12:39 AM
అలంపూర్, మార్చి 1:అలంపూర్ మండలం గుందిమల్లలో అలివి వలల వేటపై ఆదివారం రగడ నెలకొంది. అక్రమ చేపల వేటను అడ్డుకున్న సర్పంచ్ పుష్పావతి శ్రీనివాసులపై కొందరు దాడికి యత్నం చేసినట్లు తెలిసింది.
అయితే కొన్ని నెలలుగా వైజాగ్ నుంచి వచ్చిన వ్యక్తులు నిబంధనలకు విరుద్ధంగా అలివివలలతో మత్స్య సంపదను దోచుకుంటున్నారనే కారణంగా సర్పంచ్ వారిని నిలదీయగా వేటగాళ్లు ఘర్షణకు దిగారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో గొడవకు దారి తీసే పరిస్థితులు తప్పినట్లు తెలిసింది. అలివి వలల వేటను వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.




