9 June, 2026 | 2:15 AM

కాంగ్రెస్‌ది హిట్లర్ మనస్తత్వం!

09-06-2026 01:42 AM
  1. ఏటీఎంలా పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు 
  2. మూసీ పునరుద్ధరణ సీఎం రేవంత్‌రెడ్డికి రెండో ఏటీఎం!
  3. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ల జపం చేస్తున్న సీఎం 
  4. మహారాష్ట్ర సీఎం అపాయింట్‌మెంట్ కోసం తెలంగాణ నుంచి అభ్యర్థన వెళ్లలేదు
  5. దేశవ్యాప్తంగా సేకరించిన 104 లక్షల టన్నుల ధాన్యంలో సగం మన నుంచే 
  6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు 

హైదరాబాద్, జూన్ 8 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీది హిట్లర్ మనస్తత్వమని, రాజ్యాంగం, రాజ్యాంగ వ్యవస్థలు, ప్రజాస్వా మ్య సంస్థల మీద కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు కాళేశ్వరం.. కాంగ్రెస్ పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు.

కమీషన్ల కోసమే ప్రాజెక్టులు నడుస్తున్నాయనే అను మానాలు వ్యక ్తమవుతున్నట్టు పేర్కొన్నారు. హైదరా బాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో సోమవారం మీడియా సమావేశం లో రాంచందర్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్‌కు అధ్యక్షుడు ఎవరైనా నిర్ణయాలు మాత్రం ఒకే కుటుంబం తీసుకుంటుందని, అదే నియం తృత్వ ధోరణిని తెలంగాణలో కూడా అమలు చేయాలని చూస్తున్నారని అభిప్రాయపడ్డారు.

హిట్లర్ తరహా ఆలోచనలతో నడిచే ఏ రాజకీ య పార్టీ అయినా చివరికి ప్రజల తిరస్కారా న్నే ఎదుర్కొంటుందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య కూడా ఆ పార్టీ పరిస్థితిని తెలియజేస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి... ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము గురించి మాట్లాడిన తీరు బాధాకరమన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి.. ఉదయం బీజేపీ, మధ్యాహ్నం బీజేపీ, రాత్రి బీజేపీ అన్నట్లుగా వ్యవహరిస్తు న్నారని, కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పేర్లు తప్పా మరో అంశం మాట్లాడటం లేదన్నారు. మోదీ సభ విజయవంతమైన తర్వాత వచ్చిన నివేదిక లతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలపడుతోందనే విషయం కాంగ్రెస్‌కు స్పష్ట మైందన్నారు. అందుకే బీజేపీపై అసహనం, ఆందోళన, భయం పెరిగిందన్నారు.  

ఏటీఎంలా పాలమూరు

పాలమూరు- ప్రాజెక్టు విష యంలో భారీఅవినీతి జరుగుతోందనే అను మానాలు వ్యక్తమవుతున్నాయని రాంచంద ర్‌రావు ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, కానీ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుండా, డీపీఆర్ స్పష్టత లేకుండా, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం తమకు ఆమోదయోగ్యం కాదన్నారు.

మూసీ పునరుద్ధరణ సీఎం రేవంత్‌రెడ్డికి రెండో ఏటీఎం అని, సీఎం, మంత్రులందరూ కలిసి పంచుకునే ప్లాన్‌లో ఉన్నారని ఆరోపించారు. నాడు కేసీఆర్‌కు కాళేశ్వరం ఏటీఎం అయితే ఇప్పుడు రేవంత్ కి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, గాంధీ సరోవర్ ప్రాజెక్టులు రెండు ఏటీంఎలుగా మారాయన్నారు. కమీషన్ల కోసమే ప్రాజె క్టులు నడుస్తున్నాయన్నాయనే అనుమానా లున్నాయని తెలిపారు.

కృష్ణాజలాల విష యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, తెలంగాణకు రావాల్సిన నీటిని ఇతర రాష్ట్రాలకు మళ్లించే అంశాలపై ఎందుకు మౌనం పాటిస్తున్నారు?, పాలమూరు -రంగారెడ్డి గురించి మాట్లాడేటప్పుడు ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించడం లేదు? తెలంగాణ హక్కులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అబద్ధాలు, వ్యక్తిగత దూషణలు, తప్పుడు ప్రచారాలతో రాజకీ యాలు చేయకుండా ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్నారు. ప్రజా వ్యతిరేకి విధానాలపై బీజేపీ పోరాటం చేస్తుందని, విద్యార్థి భరోసా చేపడతామన్నారు. ఇండి కూటమిలో ఎవ రుంటారో పోతారో తెలియదన్నారు. 

ధాన్యం కొనుగోళ్ల లెక్కలు చెప్పాలి

దేశవ్యాప్తంగా సేకరించిన ధాన్యంలో 104.41 లక్షల టన్నులు ఉంటే, అందులో తెలంగాణ నుంచే 55.31 లక్షల టన్నులు సేకరించారని తెలిపారు. ఎంఎస్పీ కింద దేశవ్యాప్తంగా రైతులకు చెల్లించిన మొత్తం సుమారు రూ.21,243 కోట్లు కాగా, అందులో తెలంగాణ రైతులకు రూ.13,171 కోట్లకు పైగా చెల్లింపులు జరిగాయన్నారు. ఎంఎస్పీ ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య దేశవ్యాప్తంగా 11.69 లక్షల మంది కాగా, అందులో 7,79,358 మంది తెలంగాణ రైతులే అన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెబు తోందని, ఎక్కడ కొనుగోలు చేశారో చెప్పాల న్నారు. మార్చి 25 నుంచే ప్రారంభం కావాల్సిన కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 25 వరకు ప్రారంభించలేదని తెలిపారు. 

సీఎంవో నుంచి అభ్యర్థన వెళ్లలేదు

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అపా యింట్ మెంట్ విషయంలో కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారని, అయితే తాను స్వయంగా ఫడ్నవీస్ కార్యా లయానికి ఫోన్ చేశానని, నెల రోజుల క్రితం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తరఫున ఏదో ఒక అభ్యర్థన వచ్చిందని చెప్పారని వెల్ల డించారు. కానీ తెలంగాణ సీఎం కార్యాల యం నుంచి ఎలాంటి అధికారిక అభ్యర్థన రాలేదని స్పష్టం చేశారన్నారు.

రేవంత్‌రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించ కుండా ఇతరు లపై నెట్టేయడం సరైంది కాదన్నారు. మెట్రో విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్రను పూర్తిగా దాచిపెడుతు న్నారని, హైదరాబాద్ మెట్రో గురించి మాట్లాడే టప్పుడు ప్రధాని మోదీ సహకారం, కేంద్ర ప్రభుత్వ సహకారం గురించి ఎందుకు చెప్పడం లేదు? అన్నా రు. ఎంఎంటీఎస్, మెట్రో, ఆర్‌ఆర్‌లో కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించిందన్నారు.