02-02-2026 12:14:40 AM
వేములవాడ, ఫిబ్రవరి 1,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ పట్టణంలోని ఎస్సారార్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఆదివారం ఉత్సాహంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు దిశానిర్దేశం చేశారు.జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీ నివాస్ సమక్షంలో అన్ని వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులు సమావేశానికి హాజరయ్యారు.
ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం క్రమబద్ధంగా పనిచేయాలని, వార్డు స్థాయిలో బలమైన ప్రచారం నిర్వహించాలని సూచించారు.పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని నేతలు ధీమా వ్యక్తం చేశారు.