calender_icon.png 2 February, 2026 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరాటేలో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బెల్ట్, ప్రశంసా పత్రాల పంపిణీ

02-02-2026 12:15:21 AM

వడ్డేపల్లి ఫిబ్రవరి 1: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీలో యమగూచి కరాటేలో ప్రతిభ కనబరచిన 22 మంది విద్యార్థిని విద్యార్థులకు ఎల్లో బెల్ట్, ప్రశంశా పత్రాలు పంపిణి చేశామని శాంతినగర్ సేవా సమితి సభ్యులు షేక్ అస్లాం షరీఫ్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఎదిగే విద్యార్థిని విద్యా ర్థులకు కరాటే తనను తాను రక్షించుకొనే ఒక ఆయుధం లాటిందని ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని అన్నారు. భవిష్యత్ లో ఇంకా ప్రతిభ కనబరిచే మరింత మంది విద్యార్థులకు మా సేవా సమితి తరపున సహాయ సహాకారాలు అందిస్తామని అస్లాం అన్నారు. ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు దాసువరం, నాగరాజు, ఖాజా, పవన్ ఇస్మాయిల్, టీచర్ మహమ్ముద్ మరియు విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.