14 April, 2026 | 9:08 PM

గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసన

22-12-2025 12:20 AM

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 21 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్చడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీ నివాస్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా సంగీతం శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూపీఏ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాల పేర్లను మార్చడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన అజెండాగా మారిందని విమర్శించారు. ఇందిరా ఆవాస్ యోజనను ప్రధానమంత్రి ఆవాస్ యోజనగా, రాజీవ్ గాంధీ విద్యుత్ పథకాన్ని దీన్ దయాల్ గ్రామ జ్యోతి యోజనగా, ఇం దిరా మాతృత్వ సహాయ్ను ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజనగా, నెహ్రూ అర్బన్ మిషన్ను అమృత్ పథకంగా మార్చి న బీజేపీ ఇప్పుడు మహాత్మా గాంధీ పేరును కూడా తొలగించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

200 సంవత్సరాలకు పైగా బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన గాంధీ మహాత్ముడి పేరును పేదలకు ఉపాధి కల్పించే పథకం నుంచి తొ లగించడం దుర్మార్గపు చర్య అని అన్నారు. ఓటు చోరీతో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం పథకాల పేర్లు మార్చడం తప్ప ప్ర జలకు ఉపయోగపడే ఒక్క పథకం కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.

ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర  ప్రభు త్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివా స్ మాట్లాడుతూ.ఉపాధి హామీ పథకం పేరు నుంచి గాంధీ పేరును తొలగించడం ప్రజాస్వామ్యంపై దాడి అని అన్నారు. మోదీ, అ మిత్ షాలు పథకం పేరు మార్చినంత మాత్రాన ప్రజల గుండెల్లో నుంచి గాంధీని తొలగించలేరని స్పష్టం చేశారు. గాంధీ, నె హ్రూ, ఇందిరా, రాజీవ్ గాంధీల పేర్లను చరి త్ర నుంచి తొలగించే కుట్ర కేంద్రం చేస్తోంద ని మండిపడ్డారు.బీజేపీ పది సంవత్సరాల పాలనలో పేదలకు ఉపయోగపడే ఒక్క పథ కం చూపించగలదా? అని ప్రశ్నించారు. ప్ర జలను మతాల వారీగా, ప్రాంతాల వారీగా విభజించి పాలించడమే బీజేపీ విధానమని విమర్శించారు. 

వెంటనే ఉపాధి హామీ పథకానికి గాంధీ పేరు పునరుద్ధరించాలని డి మాండ్ చేశారు.బీజేపీబీఆర్‌ఎస్ చీకటి దోస్తా నా నేటికి బయటపడిందని, రానున్న ఎన్నికల్లో రెండు పార్టీలకు ప్రజలు తగిన గుణ పాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధి హామీ పథకానికి తిరిగి గాంధీ పేరు పెడతామని తెలిపారు.