22-12-2025 12:21:57 AM
నిజామాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్చినందుకు కేంద్ర ప్రభుత్వా వైతిరేకంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు హాజరయ్యారు. ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందన్. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రేడ్డి , రూరల్ ప్రెసిడెంట్ బొబ్బిలిరామకృష్ణ, ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్, సాయిబాబా గౌడ్ , నూడా చైర్మన్ కేశవేణు ఏఐసీసీ యూత్ సెక్రటరీ వీపుల్ గౌడ్ , ఫహీమ్ శ్రావణ్ అబ్దుల్ మోసిన్ తహసీన్ అహ్మద్ , నటరాజ్ పాల్గొన్నారు.