4 April, 2026 | 1:58 PM

Breaking News

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •   నాటు సారా తాగి ముగ్గురు మృతి — సారా వల్లే మరణించారా ?   •   పురుగుమందు డబ్బాలతో రైతుల ఆందోళన   •   పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి మృతి, ముగ్గురికి గాయాలు   •  

బాబ్రీ మసీదు నిర్మాణం ఎప్పటికీ జరగదు

11-02-2026 01:15 AM
  1. అలాంటి కలలు కనేవారుంటే.. ఆ కలలు కల్లలే
  2. మొదటి నుంచి బీజేపీది అయోధ్యలో రామమందిర నిర్మాణ సంకల్పమే..
  3. ఆ కలను మేం సాకారం చేసి చూపించాం
  4. సీఎం యోగి ఆదిత్యనాథ్

డెహ్రాడూన్, ఫిబ్రవరి 10: అయోధ్యలో ఎప్పటికీ బాబ్రీ మసీదు పునఃనిర్మాణం జరగదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ఆ కలలు కనేవారుంటే, వారి కలలు కల్లలుగానే మిగిలి పోతా యని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంచల్‌లోని హరిద్వార్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ముందు నుంచి అయోధ్యలో రామ మందిరం కడతామని చెప్తూ వచ్చిందని, ఆ కలను నిజం కూడా చేసిందని గుర్తుచేశారు.

భారత సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిఒక్కరూ గౌరవించాలని, ఈ దేశానికి సనాతన ధర్మమే గర్వకారణమని కొనియాడారు. ఒక దేశ ప్రధాని మోదీ రామమందిరంపై కాషాయ జెండాను ఎగురవేయడం, సనాతన ధర్మానికి అసలైన ప్రతీక అభివర్ణించారు. కొందరు స్వార్థపరులు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే రాముడిని తలుచుకుంటారని విమర్శించారు. అలాంటి వారిని భగవంతుడు సైతం మర్చిపోతాడని తెలిపారు.

చట్టాలను గౌరవించే వారు మాత్రమే ప్రశాంత ఉండగలుగతారని, నిబంధనలు అతిక్రమించే వారికి నరకం తప్పదని హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘించి స్వర్గానికి వెళ్లాలని చూసే వారి, దేవుడు ఉపేక్షించడని పేర్కొన్నారు. సనాతన ధర్మంపై జరుగుతున్న కుట్రలపై ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. 2017 కంటే ముందు ఉత్తరప్రదేశ్ అల్లర్లతో అట్టుడికేదని, తమ పాలనలో శాంతిభద్రతలు అదుపులోకి వచ్చాయని పేర్కొన్నారు.