ఈ బడి మార్చేది ఎవరు
35 మంది పిల్లలు. ఏడుగురు సార్లు
హాజరు అయ్యేది సగం మంది విద్యార్థులు
ఇప్పటివరకు ప్రార్థన చేయని దుస్థితి
దాత స్ఫూర్తి.. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం
ఇది ఓలా ఉన్నత పాఠశాల దుస్థితి
భైంసా జులై 5 (విజయక్రాంతి): మన ఊరి బడి కోసం ఎన్నారై 30 లక్షలు ఖర్చుచేసి బడి నిర్మిస్తే బాధ్యతలు మరిచిన ఉపా ధ్యాయులు చదువులను చదువులను అటకెక్కిస్తున్నారు. పేరుకు ఉన్నత పాఠశాల అయి నప్పటికీ ఆ పాఠశాలలో 35 మంది విద్యార్థులు మాత్రమే ఉండగా అందులో ప్రతిరో జు 25 మంది మాత్రమే పాఠశాలకు హాజరవుతున్నారు.
విద్య బోధనకు ఏడుగురు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్న పాఠశాల నిర్వహణ బాధ్యత విస్మరించడం పేద విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. శుక్రవారం పాఠశాలను సందర్శించగా పాఠశాల నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపించాయి. పాఠశాల ప్రారంభమై 15 రోజులు గడుస్తు న్న ఇప్పటివరకు ఏ ఒక్కరోజు కూడా ప్రార్థన చేసిన సందర్భాలు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదేమని అడిగితే పాఠశాలకు పిల్లలు రానప్పుడు మేమేం చేస్తాం అంటూ ఉపాధ్యాయులు తప్పించుకుంటున్నారు 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఈ ఉన్నత పాఠశాలలో ప్రవాస భారతీయుడు గందె ప్రమోద్ తండ్రి గంద శంకర్ స్మారకర్థం 30 లక్షల విలువ చేస్తే పాఠశాల భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు.
తాను పుట్టి పెరిగిన పాఠశాల బాగుకోసం ఎన్నారై 30 లక్షలు పెట్టి సొంత బో నం నిర్మించి ఇస్తే అందులో పని చేసే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ప్రస్తుతం కళా హీనంగా కనిపిస్తోంది. ఒకప్పుడు 120 మం ది ఉన్న విద్యార్థులు ఈ నాలుగేళ్లలో 35 మందికి పడిపోగా అసలు పాఠశాలకు 25 మందికి మించి హాజరు కావడం లేదు.
ఈ పాఠశాలలో ఆరవ తరగతిలో నలుగురు ఏడవ తరగతిలో ఏడుగురు ఎనిమిదిలో ఐదులు తొమ్మిదిలో ఏడుగురు పదిలో 14 మంది విద్యార్థులు చదువుతున్నట్టు అధికారులు చెబుతున్న శుక్రవారం కేవలం 11 మం ది మాత్రమే విద్యార్థులు హాజరుకాగా అందులో ముగ్గురు బాలికలు మిగతావారు బాలురు. ఈ పాఠశాలలో ఏడుగురు మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా కేవలం ఇద్ద రు మంది మాత్రమే సకాలంలో రాగా హె డ్మాస్టర్ ఆలస్యంగా వచ్చారు. పిల్లలు నేరుగా తరగతి గదిలోకి వెళ్లి ఉపాధ్యాయుల కోసం వేచి చూస్తున్నారు
మూతపడే స్థాయికి
కుంటాల మండలంలోని గందె శంకర్ మెమోరియల్ ఉన్నత పాఠశాల లక్ష్యం ఎలా ఉన్నా ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కారణంగా మూతపడి పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. పాఠశాలకు పూల తో పాటు సూర్యాపూర్ మెదల్పూర్ అంబు గాం గ్రామాలు ఉన్నప్పటికీ ఉపాధ్యాయులు బడిబాటలో పిల్లలను మోటివేషన్ చేసి చే ర్చుకునే సందర్భాలు తక్కువేనని చెప్తున్నారు.
అయితే పాఠశాలలో అడ్మిషన్ పొందిన విద్యార్థులు సమయపాలన పాటించకుండా ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నా పోతున్న ఉపాధ్యాయులు వారిని క్రమశిక్షణ పెట్టిన సందర్భాలు లేవని విమర్శిస్తున్నారు. సదరు ఉపాధ్యాయుని పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారు. పాఠశాలలో ప్రతిరోజు 9 10 నిమిషాలకు ప్లేయర్ నిర్వహించ ఉండవుగా ఇప్పటివరకు 15 రోజుల్లో ఒక్కసారి కూడా ఉదయం ప్రేయర్ నిర్వహించిన సందర్భాలు లేవని తల్లిదండ్రులు చెప్తున్నారు.
పిల్లలు ఇద్దరు వచ్చిన సార్లు సమయానికి వచ్చి వచ్చిన పిల్లలతో ప్రార్థన తప్పనిసరిగా చేయించవలసి ఉంటుంది. ఉపాధ్యాయుల నిర్లక్ష్యంతో ప్రేయర్ కాకపోవడం పాఠశాల విద్యా ప్రమాణాలకు బే సూత్రాన్ని కూడా ఉపాధ్యాయులు పాటించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వచ్చిన ఉపాధ్యాయులు కూడా పిల్లలు తక్కువగా ఉండడంతో పాఠా లు కూడా బోధించకుండా నామమాత్రపు బోధన చేసి సమయం రాగానే వెళ్ళిపోతున్నారని కొందరు విద్యార్థులు చెప్తున్నారు. అసలు విద్యా బోధన కూడా జరగడం లేదని పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు కూడా సమయపాలన పాటించకుండా బడికి వచ్చామా వెళ్లేమా అనే రీతిలో వెళ్లడంత వచ్చి చదువుకునే విద్యార్థులు కూడా సరైన న్యాయం జరగడం లేదు.
ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లలు కావడంతో ఆర్థిక స్తోమత లేక ప్రభు త్వ బడికి పంపితే ప్రభుత్వ బళ్ళు కూడా తమ పిల్లలకు విద్య రావడం లేదని దీంతో కొందరు బడి తీసి తీసుకొని వేరే పాఠశాలలో అడ్మిషన్ తీసుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ పాఠశాలపై జిల్లా ఉన్నత విద్యాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ప్రభుత్వ పాఠశాలను గాడిలో పెట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.






