15 May, 2026 | 11:49 PM

Breaking News

కట్టమైసమ్మ అమ్మవారి త్రిశూలం ధ్వంసం

09-11-2024 01:21 AM

నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసిన స్థానికులు 

రాజేంద్రనగర్, నవంబర్ 8: శంషాబాద్‌లోని సిద్ధాంతి వద్ద ఉన్న కట్టమైసమ్మ ఆలయంలోని అమ్మవారి త్రిశూలాన్ని శుక్రవారం ఓ వ్యక్తి ధ్వంసం చేశాడు. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు అతడిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. దాడి చేసిన వ్యక్తి తన పేరు కిశోర్ అని తెలిపాడు. అమ్మవారే ధ్వంసం చేయమన్నది అని చెప్పడం గమనార్హం. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అతడిని పోలీసులకు అప్పగించారు.