17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వినాశకారి బీఆర్‌ఎస్సే

29-04-2025 12:59 AM
  1. ఒక్క ప్రాజెక్ట్‌ను పూర్తిచేయలేదు
  2. కాళేశ్వరంపై లక్ష కోట్లు పెట్టి, లక్ష ఎకరాలకూ నీరివ్వలేదు
  3. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

నల్లగొండ, ఏప్రిల్ 28: ధనిక రాష్ట్రమైన తెలంగాణను నాశనం చేసింది బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆరేనని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కృష్ణానది నీటి కేటాయింపులో తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేసింది గత ప్రభుత్వమేనని విమర్శించారు.

బచావత్ ట్రిబ్యునల్ 811 టీఎంసీల నీటిని ఉమ్మడి ఏపీకి కేటాయిస్తే, ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలే చాలని గత పాలకులు రాసి ఇచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే 500 టీఎంసీలు కావాలంటూ కేంద్రంతో కొట్లాడుతు న్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై లక్ష కోట్లు ఖర్చుపెట్టిన గత ప్రభుత్వం, లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేదన్నారు.

పాలమూరు-రంగారెడ్డిపై రూ.27,500 కోట్లు, సీతారాం సాగరంపై రూ.8 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు కూడా నీరందించలేకపోయారని ఆరోపించారు. ఇంకా అనేక ప్రాజెక్టులను పూర్తి చేయని అసమర్థులు బీఆర్‌ఎస్ పాలకులని ఆరోపిం చారు. ఇన్ని రకాలుగా తెలంగాణను అన్యా యం చేసిన కేసీఆర్, ఇయ్యాల ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని వాపోయారు. గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాలో ఎలాంటి ఇరిగేషన్ పనులు చేపట్టలేదన్నారు.

ఎన్నో ఏండ్ల నుంచి రైతులు ఎదురుచూస్తున్న డిండి లిఫ్ట్ ఇరిగేషన్‌కు ఏదుల ద్వారా నీరందించేందుకు తామ ప్రభుత్వం రూ.1,800 కోట్లు మంజూరు చేసిందని వివరించారు. అలాగే హై లెవెల్ కెనాల్‌కు రూ. 442 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. పిల్లాయిపల్లి కాలువ, శివన్నగూడెం నుంచి నారాయణ్‌పూర్, చౌటుప్పల్ మీదుగా సాగునీరు అందించేందుకు లిఫ్ట్ ఇరిగేషన్ తప్పనిసరిగా మంజూరు చేస్తామని ప్రకటించారు.

దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు, మరో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిచేస్తామని, అలాగే అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ పనులు కూడా వేగవంతం చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నాగార్జునసాగర్ నియోజకవర్గానికి మేలు చేసే నెల్లికల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు వేగవంతం చేసి, త్వరలోనే స్టేజి వన్ ద్వారా సాగునీరు ఇస్తామ న్నారు. అలాగే రాచకాలువ, గంధమల్ల ప్రాజెక్టును తప్పనిసరిగా పూర్తి చేస్తామన్నారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నారా యణ్‌పూర్, చౌటుప్పల్‌కు కాల్వ విస్తరించి నీరందిస్తామన్నారు.