calender_icon.png 17 January, 2026 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్ల విభజన ప్రక్రియ అశాస్త్రీయం

17-01-2026 01:30:59 AM

బీజేపీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్ ఛార్జి తోకల శ్రీనివాస్‌రెడ్డి

రాజేంద్రనగర్, డిసెంబర్ 17,  (విజయక్రాంతి): రాజేంద్ర నియోజకవర్గం డివిజన్ల విభజన ప్రక్రియ అశాస్త్రీయంగా ఉందని  బిజెపి రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి తోకల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు * బుధవారం రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ముందు పార్టీ నాయకులు కార్యకర్తలతో డివిజన్ల విభజన ప్రక్రియ నిరసిస్తూ ధర్నా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని  శంషాబాద్ మున్సిపాలిటీలు, రాజేంద్రనగర్ సర్కిల్, బండ్లగూడ మున్సిపాల్ కార్పొరేషన్, నార్సింగి మున్సిపాలిటీ, మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల పునర్విభజనలో అనేక అవకతవకులున్నాయని విమర్శించారు. 

ఈ విభజనను గమనిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మహానగరంలో శివారు ప్రాంతాలను విలీనం చేస్తూ మజ్లిస్ పార్టీకి దారాదత్తం చేసినట్లుగా ఉందనిపిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం  ఏఐఎంఐఎం పార్టీని బలపరచడానికి మజ్లిస్ పార్టీకి భానిసగా వ్యవహరిస్తూ కాంగ్రెస్ తప్పుడు నిర్ణయాన్ని తీసుకుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ సమాజాన్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తుందని అనుమానం కలుగుతుందన్నారు. 

స్థానిక శాసనసభ్యుడు ప్రకాష్ గౌడ్  రాజేంద్రనగర్ నియోజకవర్గ అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే కనీసం లక్ష ఓట్లున్న శంషాబాద్ ప్రాంతాన్ని కేవలం రెండు డివిజన్లుగా విభజించడం,   శివరాంపల్లి ప్రాంతాన్ని సులేమాన్ నగర్ డివిజన్ లో కలపడంఫై అయన ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ విభజన ప్రక్రియ ఆ ప్రాంతానికి తీరని లోటు చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను దానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దానం చేశారు.  ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు ఎన్ మల్లారెడ్డి వై శ్రీధర్ ఎం కొమరయ్య పి మల్లేష్ యాదవ్ ఎస్ వెంకటేష్ అడిగే జనార్ధన్ పి సందీప్ చైత్ర నాయకులు పాల్గొన్నారు