పేదల సొంతింటి కల సాకరం
చేవెళ్ళ నియోజకవర్గ ఇంచార్జి పామెనభీమ్ భరత్
చేవెళ్ళ /నవాబ్ పేట్ ఏప్రిల్ 08(విజయక్రాంతి): చేవెళ్ళ నియోజకవర్గంలోని నవాబ్ పెట్ మండలం పులుమామిడి గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను చేవెళ్ల నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి పేదల పక్షాన నిలిచారన్నారు. పేదింటి కల నెరవేర్చిన ఘనత సిఏం రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు.
ఈ కార్యక్రమంలో నవాబ్ పెట్ మండలం అధ్యక్షులు వెంకటయ్య, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సామ వెంకట్ రెడ్డి, నవాబ్ పేట సర్పంచ్ నరసింహ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రసాద్,ఉపేందర్ రెడ్డి, యావాపూర్ సర్పంచ్ లక్ష్మణ్ , పులుమామిడి సర్పంచ్ నరసింహులు, చించల్ పెట్ సర్పంచ్ అనంత రాములు, ఉప సర్పంచ్ లు మల్లేష్,రాజు, మహేందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాండు రంగా రెడ్డి వెంకయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ మెంబెర్స్ సీనియర్ నాయకులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




