జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మహా కుటుంబం
11-06-2026 12:36 PM
కరీంనగర్: మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర చైర్మన్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ జన్మదిన సందర్భంగా కవ్వంపల్లి మహా కుటుంబం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కవ్వంపల్లి మహా కుటుంబం సమన్వయకర్త కవ్వంపల్లి భూమేష్ , సభ్యులు కవ్వంపల్లి కనకరాజు , కవ్వంపల్లి సంజీవ్ , కవ్వంపల్లి వేణు కుమార్ డా. కవ్వంపల్లి సత్యనారాయణ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజాసేవలో ఆయన మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.






