11 June, 2026 | 2:08 PM

ఒమన్ తీరంలో అమెరికా దాడి: ముగ్గురు భారతీయులు మృతి

11-06-2026 01:16 PM

న్యూఢిల్లీ: ఒమన్ తీరంలో ఒక నౌకపై అమెరికా బలగాలు(US Attack) దాడులు జరిపాయి. అమెరికా దాడుల్లో మొదట గల్లంతైనట్లుగా భావించిన ముగ్గురు భారతీయ నావికులు(Three Indians killed) మరణించారని షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్(Minister of Shipping Sarbananda Sonowal) తెలిపారు. దాడి సమయంలో నౌకలో 24 మంది భారతీయులున్నారు. అమెరికా దాడులను భారత్ తప్పుబట్టింది. వాణిజ్య నౌకలపై దాడులను ఆపాలని భారత్ డిమాండ్ చేసింది. బాధిత కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం(Central Government) అండగా ఉంటుందని సర్బానంద సోనోవాల్ హామీ ఇచ్చారు. మృతులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర చర్యలు చేపట్టింది. 

భారత విదేశాంగశాఖ ఢిల్లీలోని అమెరికా రాయబారికి(US Ambassador) సమన్లు జారీ చేసింది. నౌకలపై దాడులను ఐరాస వేదికగా భారత్ ఖండించింది. పలువురు భారతీయులు చనిపోతున్నారని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఒమన్ గల్ఫ్ ప్రాంతంలో అమెరికా సైన్యం దాడికి గురైనప్పుడు, పలావు (Palau) దేశపు జెండాను కలిగి ఉన్న 'సెట్టెబెల్లో' (Settebello) అనే చమురు ట్యాంకర్‌లో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 24 మంది భారతీయులు కాగా, మిగిలిన నలుగురు విదేశీయులు (ఇద్దరు పాకిస్థానీయులు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ జాతీయుడు) ఉన్నారు. తమ ఆదేశాలను పాటించకపోవడం, ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తుండటం వల్లే ఆ నౌకపై దాడి చేశామని అమెరికా సైన్యం తెలిపింది.