ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌ను ఆ స్కూళ్ల టీచర్లకూ అమలుచేయాలి
04-03-2026 12:52 AM
సీఎంకు ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి వినతి
హైదరాబాద్, మార్చి 3( విజయక్రాంతి): త్వరలో ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్‌లో ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులకు వర్తించేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి విజ్ఞప్తి చేశారు.వెంటనే ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని అమలులోకి తేవాలని సీఎస్ రామకృష్ణరావుని సీఎం మౌఖికంగా ఆదేశించారు.
అలాగే పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలను జాప్యం చేయకుండా విడుదల చేయాలని కోరగా, అందుకు ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్సీ తెలిపారు. సీఎంను కలిసిన వారిలో రాష్ట్ర పెన్షనర్ల సంఘం అధ్యక్షులు పేరి వెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.




