అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూంలో భద్రం
పోలీసు రక్షణలో ఈవీఎంలు
పార్లమెంట్ ఎన్నికలకు 4,16,362 మంది దూరం
క్రాస్ ఓటింగ్ పై జోరుగా చర్చ
సంగారెడ్డి, మే 15 (విజయక్రాంతి) : జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో 16,41,410 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల్లో 12,25,049 మంది ఓటు హక్కు వియోగించుకున్నారు. నియోజకవర్గంలో 4,16,361లక్షల మంది ఓటర్లు ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకోలేదు. పార్లమెంట్ పరిధిలో 19మంది అభ్యర్థులు పోటిలో ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు పోటిలో ఉన్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య నువ్వా.. నేనా అనే తిరులో పోటీ ఉంది.
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
లోకసభ ఎన్నికల్లో గెలుపుపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు ధీమాతో ఉన్నారు. గెలుపుపై ఎవరికి వారు అంచనలు వేసుకుంటు న్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎవరు గెలుపొందిన స్వల్వ ఓట్ల తేడాతో గెలిచే అవకాశం ఉందనే సమాచారం వినిపిస్తోంది. లోకసభ ఎన్నికలు రెండు వర్గాల మధ్య జరగడంతో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. బీజేపీ నాయకు లు మాత్రం తమకు అన్ని వర్గాల ఓట్లు వచ్చాయని తామే మెజార్టీ లిస్టులో ముందుటా మని ధీమాతో ఉన్నారు. గెలుపు కోసం వివిధ పార్టీల నాయకులు బూత్‌ల వారీగా లెక్కలు వేసుకుంటున్నారు. ఏ బూత్‌లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో అంచన వేస్తున్నారు.
జహీరాబాద్‌లో క్రాస్ ఓటింగ్ ఎవరిని ముంచేనో
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందనే ఆరోపణలు వస్తున్నాయి. లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ నుంచి అభ్యర్థులు పోటీలో ఉన్న ఎన్నికల రోజు భారీగా క్రాస్ ఓటింగ్ జరిగిందని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అభ్యర్థి గెలువకపోయిన పరవలేదు.. కాంగ్రెస్ అభ్యర్థి గెలువొద్దనే పట్టుదలతో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీగా క్రాస్ ఓట్లు వేసిన్నట్లు సమా చారం. దీంతో క్రాస్ ఓటింగ్ ఎవరికి మేలు చేస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో ఎక్కడ చూసిన క్రాస్ ఓటింగ్ పై చర్చ జరుగుతుంది.




