ట్రైడెంట్ కార్మికుడి హల్‌చల్
పొగగొట్టంపై ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటు బెదిరింపు
చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోని యాజమాన్యం
యాజమాన్య నిర్లక్ష్యంపై కార్మికుల ఆగ్రహం
జహీరాబాద్, మే 15 : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని కొత్తూర్(బి) గ్రామంలో ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుడు రమేశ్‌బాబు జీతం డబ్బులు ఇవ్వడంలేదని ఫ్యాక్టరీ పొగగొట్టం(చిమ్నీ)పై ఎక్కి జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశాడు. కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీలో విధులు నిర్వహిస్తున్న యాజమాన్యం సకాలంలో జీతాలు ఇవ్వడం లేదని, ఈ నెల 22న తన కూతురి వివాహం జరిపేందుకు చేతిలో డబ్బులు లేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఇందుకు ఉపక్రమించినట్టు తెలిపారు. సకాలంలో జీతాలు రాకపోవడంతో పిల్లల చదువులు, కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు.
రమేశ్‌బాబు అనారోగ్య సమస్యతో పాటు కూతురి వివా హం ఉండగా ఎలా చేయాలని ఫ్యాక్టరీ చి మ్నీపైకి ఎక్కడని తెలిపారు. విషయం తెలుసుకున్న తొటి కార్మికులతో పాటు ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు ఫ్యాక్టరీకి చేరుకున్నారు. చిమ్నీపై ఎక్కిన రమేశ్‌బాబును వారు మాట్లాడి కిందకు దిగి రావాలని కోరారు. యాజమాన్యం ఇక్కడి వచ్చి తన జీతం డబ్బులు ఇచ్చే వరకు దిగేదిలేదని రమేశ్‌బాబు తెల్చిచెప్పారు. ఈ నెల 22న కూతురి వివాహం ఉంది, జీతం డబ్బులు ఇవ్వకుంటే పెండ్లి ఎలా చేయ్యాలి, అనారోగ్య సమస్యలతో అనేక ఇబ్బందులకు గురవుతున్నాని ఆవేదన వ్యక్తం చేశాడు.
జీతాల కోసం సంవత్సరాల తరబడి యాజమాన్యాన్ని విజ్ఞప్తి చేసిన ఫలితం లేకపో వడతంతోనే దిక్కుతోచని పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకున్నాని చెప్పాడు. తనకు జీతం డబ్బులు చెల్లిస్తేనే కిందకు దిగుతానని, లేకుంటే కిందకు దూకి ఆత్మహత్యకు చేసుకుంటాని హెచ్చరించారు. విషయం తెలు సుకున్న జహీరాబాద్ పట్టణ సీఐ రవి, చిరాగ్‌పల్లి ఎస్సై నరేశ్ సిబ్బందితో హుటాహుటి న ఫ్యాక్టరీ చేరుకున్నారు. కార్మికుడు రమేశ్‌బాబుతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తా మని చెప్పిన ససేమిర అన్నారు. దీంతో కార్మిక సంఘం అధ్యక్షుడు ఎంజీ రాములు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, జహీరాబాద్ ఆర్డీవో రాజుకు ఫోన్ చేయగా అధికారుల ఆదేశాల మేరకు లేబర్ కమిషనర్ రవీందర్‌రెడ్డి ఫ్యాక్టరీకి చేరుకున్నారు.
కార్మికుల సమస్యపై యా జమాన్యంతో మాట్లాడారు. వెంటనే కార్మికులకు జీతం డబ్బులను చెల్లించాలన్నారు. నా లుగైదు రోజుల్లో వచ్చి సమస్యను పరిష్కరిస్తామని ఫ్యాక్టరీ యాజమాని రామ్‌నాథ్ చెప్పడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలల తరబడి ఇదే మాటలు చెప్పి తమకు ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. చెప్పులరిగేలా తిరిగినా పట్టించుకోవడం లే దని ఆరోపించారు. తమకు రావాల్సిన జీతంతో పాటు ఇతర అలివెన్సు డబ్బులు చెల్లించాలని పట్టుబట్టారు. ఫిలిం డెవలప్‌మెంట్ అభివృద్ధి చైర్మన్ గిరిధర్‌రెడ్డి, కార్మిక సంఘం అధ్యక్షుడు ఎన్‌జీ రాములు, లేబర్ కమిషన్ రవీందర్‌రెడ్డి యాజమాన్యంతో మాట్లాడారు. ఫ్యాక్టరీలో పనిచేస్తున్న రమేశ్‌బాబు, శేఖర్‌కు రావాల్సిన డబ్బులను వెంట నే చెల్లిస్తామని, మిగతా కార్మికులకు ఒక నెల జీతం డబ్బులను చెల్లిస్తామని హామీ ఇచ్చారు.




