12-06-2025 12:04:30 AM
జిల్లా రవాణా అధికారి పి.రంగా రావు
పెద్దపల్లి జూన్ 11(విజయ క్రాంతి) జిల్లాలో స్కూల్ బస్సుల ఫిట్నెస్ సర్టిఫికెట్ రెన్యువల్ చేసుకోవాలని జిల్లా రవాణా అధికారి పి.రంగా రావు బుధవారం ఒక ప్రకట నలో తెలిపారు.
జూన్ 12 నుంచి పాఠశాలలు ఇతర విద్యాసంస్థలు పున ప్రారంభం అవుతున్న నేపథ్యంలో అన్ని విద్యా సంస్థల యాజమాన్యులు తమ యొక్క స్కూల్ బ స్సులు ఇతర వాహనాల ఫిట్నెస్ (వాహన సామర్థ్య పరీక్ష) రెన్యువల్ చేసుకోవాలని, ప్రతి స్కూల్ బస్ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య 35 కు అనుగుణంగా నిబంధనలు పాటించా లని లేనిపక్షంలో అపరాధ రుసుము రిజిస్ట్రేషన్ రద్దుకు సిఫార్సు చేయడం జరుగుతుందని జిల్లా రవాణా అధికారి ఆ ప్రకటనలో తెలిపారు.