ఆకట్టుకున్న ఫుడ్ మేళా
పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్
కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని డాక్టర్ రాజేంద్రప్రసాద్ విద్యా కళాశాల, శ్రీనిధి టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఫుడ్ మేళా కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యువరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయన్నారు. చట్టాలపై అవగాహ న కల్పించారు.
కరస్పాండెంట్ శివప్రసాద్ మాట్లాడుతూ కళాశాల నుంచి ఇప్పటివరకు 5 వేల మంది ఉపాధ్యాయులను తయారు చేసి, 26 ఏళ్లుగా సేవలంది స్తున్నామని తెలిపారు.బాలాజీ వరప్రసాద్ విద్యార్థులు భవిష్యత్లో బాధ్యతగల పౌరులుగా ఎదగాలని సూచించారు.విద్యార్థులు తయారు చేసి న వంటకాలు అతిథులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ క్రాప్స్ స్టేట్ కోఆర్డినేటర్ విద్యాసాగర్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.




