గల్ఫ్ సంక్షేమానికి నిధులకు భట్టికి విజ్ఞప్తి
19-03-2026 12:00 AM
నిర్మల్, మార్చి 18 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఎన్నారై పాలసీ, వలస కార్మికుల సంక్షేమానికి బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరినట్టు ఎన్నారై వలస కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు స్వదేశీ పరికిపండ్ల తెలిపారు. బుధవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వ చీఫ్ ఆది శ్రీనివాస్ ను కలిసి ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించినట్లు తెలిపా రు.
ఎన్నారై అడ్వయిజరీ కమిటీ ప్రతినిధి బృందం బుధవారం అసెంబ్లీ ఆవరణలో ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ బృందంలో ఎన్నారై అడ్వైజరీ కమిటీ వైస్ ఛైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, తదితరులు ఉన్నారు.




