8 June, 2026 | 7:38 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

అంధకారంలోకి గురుకుల విద్యార్థుల భవిష్యత్

05-09-2024 12:47 AM

మాజీమంత్రి కొప్పుల

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యార్థుల భవిష్యత్ అంధకారమవుతుందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కలుషిత ఆహారంతో విద్యార్థుల మరణా ల ఘటన మరువక ముందే ఉద్యోగు ల ఎంపికలో అవినీతి దందా బయటపడిందన్నారు. ఒక్కో అభ్యర్థికి రూ. 50 వేల నుంచి లక్ష వరకు వసూళ్లు చేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నిరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డా రు. పర్మినెంట్ ఉద్యోగాల భర్తీ పేరు తో పాతవారిని తీసేస్తారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ సర్కార్ వల్ల 38 ప్రతిభా పాఠశాలలు, 24 క్రీడా అకాడమీలు, మూజి క్ స్కూల్, సైనిక్ స్కూల్, మహిళా సైనిక్ స్కూల్, న్యాయ కళాశాల లాంటివి మూతపడే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ హయాంలో ౬ నెలల ముందే విద్యార్థులకు అన్నీ  వస్తువులను  ఇచ్చే వారని, కానీ ఇప్పుడు పాఠశాల మొదలై 3 నెలలైనా పిల్లలకు ఇప్ప టికీ యూనిఫామ్స్ ఇవ్వలేదని ఆగ్ర హం వ్యక్తం చేశారు.