స్వాతంత్య్ర సమరానికి ఊపిరిపోసిన ‘గల్లీ గణనాథుడు’

12-09-2026 | 05:05am
  1. తిలక్ ఆలోచన నుంచి నేటి వైభవం దాకా..
  2. ఈనెల 14న కొలువు దీరనున్న గణనాథులు 
  3. సిటీ శివారులో జోరందుకున్న  క్రయవిక్రయాలు 

హైదరాబాద్ సిటీబ్యూరో 11 (విజయక్రాంతి): వినాయక చవితి(Vinayaka Chavithi) పండుగ వస్తుం దంటే చాలు, గల్లీ గల్లీలోనూ ప్రతిష్టించే మండపాలతో వీధులన్నీ పండగ వాతావరణం(Festive atmosphere)తో అలరారుతాయి. అయితే, ప్రస్తుతం మనం ప్రతి వీధిలో ఎంతో కోలాహలంగా జరుపుకునే ఈ ‘సార్వజనిక గణేష్ ఉత్సవాల’ వెనుక ఒక నాటి చారిత్రాత్మక స్వాతంత్య్ర ఉద్యమ(Freedom movement) నేపథ్యం ఉంది.దీని వెనుక తిలక్ సంకల్పం దాగి ఉంది. బ్రిటిష్ పాలన(British Rule)లో భారత(Indian) ప్రజలు ఒకచోట సమకూడటానికి తీవ్ర ఆంక్షలు ఉండేవి.

ఆ సమయంలో ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించడానికి, యువతను ఒకే వేదికపైకి తీసుకురావడానికి లోకమాన్య బాలగంగాధర తిలక్(Balagangadhara Tilak) 1893లో మహారాష్ట్ర(Maharashtra)లోని పుణేలో ’సార్వజనిక గణేశ్ ఉత్సవాలకు(Public Ganesh festivities)’ శ్రీకారం చుట్టారు. కేవలం ఇళ్లకే పరిమితమైన వినాయక పూజను వీధుల్లోకి తీసుకువచ్చి, కులమతాలకు అతీతంగా సమాజాన్ని ఐక్యం గా నిలబెట్టడానికి ఈ ఉత్సవాలను ఒక ప్రచార సాధనంగా మలచుకున్నారు.

హైదరాబాద్‌కు పాకిన ఉత్సవ శోభ..

తిలక్ పిలుపుతో ప్రభావితమైన ‘భారత గుణవర్థక్ సంస్థ’ 1895లో హైదరాబాద్లోని శాలిబండలో నగరంలోనే మొదటిసారిగా బహిరంగ గణేశ్ ఉత్సవాలను నిర్వహించింది. ఆ తర్వాత కేసరి సమాజం ఆధ్వ ర్యంలో చాంద్రాయణగుట్టలోనూ ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిజాం పాలన లోని కఠిన ఆంక్షల నడుమ కూడా ఈ ఉత్సవాలు నగరంలో స్వాతంత్య్ర చైతన్యానికి, సమైక్యతకు కేంద్ర బిందువుగా నిలిచాయి.

చారిత్రక పరిణామ క్రమం..

ఛత్రపతి శివాజీ మహారాజ్, పేష్వాల కా లంలో గణేశ్ ఉత్సవాలు జరిగినా.. అవి కేవలం రాజకుటుంబాలు, వ్యక్తిగత ఇళ్లకు మాత్రమే పరిమితమయ్యాయి. 1893 (తిలక్ విప్లవం) బాలగంగాధర తిలక్ వీటిని సార్వజనిక (ప్రజా) ఉత్సవాలుగా మార్చి, స్వాతంత్య్ర ఉద్యమానికి, నాటకాలు, సాంస్కృతిక సమావేశాలకు వేదిక చేశారు. 

హైదరాబాద్‌లో 1895లో ఉత్సవాలు ఆరంభం..

శాలిబండలో ’భారత గుణవర్థక్ సంస్థ’ ఆధ్వర్యంలో తెలంగాణ నేలపై తొలి సార్వజనిక వినాయకుడిని ప్రతిష్టించారు. 1954 (ఖైరతాబాద్ మహాగణపతి) స్వాతంత్య్రానంతరం సింగరి నటరాజన్ గారు ఒక అడుగుల ఎత్తుతో ఖైరతాబాద్లో వినాయకుడిని ప్రతిష్టించగా, నేడు అది దేశంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన భారీ గణనాథుడిగా నిలిచింది.

సామాజిక సమైక్యతకు ప్రతీక ఒకప్పుడు బ్రిటిష్ పాలకులు విధించిన ’సమావేశాల నిషేధాన్ని’ అధిగమించేందుకు ఆధ్యాత్మికతను ఆయుధంగా మలచుకున్న విధానమే నేటి ‘గల్లీ గణేష్’. ఆరంభంలో స్వాతంత్య్ర ఉద్యమానికి వేదికగా నిలిచిన ఈ మండపాలు, నేడు కుల మతాల సరిహద్దులను చెరిపివేసి అన్నదానాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామా జిక సేవా కార్యక్రమాలకు చిరునామాగా మారాయి.

శివారు ప్రాంతాల్లో విక్రయాల జోరు..

ట్రాఫిక్ ఆంక్షలు, నగరంలో ఎక్కువ ధర ల వల్ల మండప నిర్వాహకులు ఎల్బీనగర్, ఉప్పల్, శామీర్పేట్, పటాన్చెరు, శంషాబాద్ వంటి శివారు ప్రాంతాల తాత్కాలిక కేంద్రా ల వైపు మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ స్పృహ పెరగడంతోపాటు మున్సిపాలిటీలు, స్వచ్ఛంద సంస్థల ప్రోత్సాహంతో మట్టి విగ్రహాల కొనుగోలు పెరిగింది.పీ ఓ పీ రంగు లు, రవాణా ఖర్చులు ఎక్కువవ్వడంతో గత ఏడాదితో పోలిస్తే విగ్రహాల ధరలు 15% నుండి 20% వరకు పెరిగాయి. 5 నుండి 15 అడుగుల మీడియం, భారీ విగ్రహాల కోసం గల్లీ యువజన సంఘాలు ముందస్తు అ డ్వాన్స్లు చెల్లించి బుక్ చేసుకుంటున్నాయి.

మరిన్ని వార్తలు