18 April, 2026 | 10:59 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

జగిత్యాల అభివృద్దే ధ్యేయం

31-05-2025 12:44 AM

ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  

జగిత్యాల అర్బన్, మే 30 (విజయక్రాంతి): జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం పనిచేస్తారని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణ 16వ వార్డులో సీఎస్‌ఐ చర్చిలో రూ. 5 లక్షలతో సిసి రోడ్డు అభివృద్ధి పనులు, 25వ వార్డులో రూ. 8లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను  జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ పరిశీలించా రు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యదిక నిధులు జగిత్యాల మున్సిపల్కు తీసుకురావడం జరిగిందన్నారు.జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. 16వ వార్డులో దాదాపు 2.5 కోట్ల, 25వార్డులో 2 కోట్ల పనులు చేయటం జరిగిందని, అభివృద్ది సంక్షేమంలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా ఉందన్నారు.

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా 4520 డబల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణంతో పేదల సొంతింటి కల సాకారమయిందని తెలిపారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు.జగిత్యాల పట్టణంలో 18 వేల ఇండ్లకు ఉచిత కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.

ఇష్టారీతిన నిర్మాణాలు చేపట్టడంతో రానున్న వర్షాకాలంలో కొన్ని వార్డులు జలమయం అయ్యే అవకాశం ఉందని, ప్రజల సహకారంతోనే పట్టణా భివృద్ధి సాధ్యమన్నారు.ఈ కార్యక్రమంలో  మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, కూతు రు రాజేష్, కుసరి అనిల్, ఆరుముల్ల నర్సమ్మ, కోరే గంగమల్లు, రాజకుమార్, డిఇ వరుణ్, ఏఈలు శరన్, అనిల్, తదితరులు పాల్గొన్నారు.