31-05-2025 12:44:18 AM
- నివాస అనుమతులతో వ్యాపార సముదాయాల నిర్వహణ
- అనుమతులకు మించి నిర్మాణాలు జరగాలంటే చేతులు తడపాల్సిందే
- లేదంటే నిర్మాణాలు అక్కడే
ఇబ్రహీంపట్నం, మే 30: ఆదిభట్ల మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట ప డటం లేదు. మున్సిపాలిటీలో రెసిడెన్షియల్ అనుమతులు పొంది... వ్యాపార వ్యాపార కార్యక్రమాలు కొనసాగిస్తున్న మున్సిపల్ అ ధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తూ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారానే ఆరో పణలు వినిపిస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల మున్సిపాలిటీలో అంతర్జాతీయ స్థాయి సంస్థలు టిసిఎస్, ఏరోస్పెస్, రంగారెడ్డి జిల్లా కలెక్టరే ట్, ఫాక్స్ కాన్, కెన్స్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఏర్పడడం వల్ల భూముల, ఫ్లాట్ల ధ రలు ఆకాశాన్నంటు తున్నాయి.
ఆయా కం పెనీలలో పని చేసేందుకు దేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల వారు స్థిరపడు తున్నారు. ఇక్కడి కంపెనీలలో పనిచేసే వారు స్థానికంగా ఉండేందుకు ఎక్కువగా ఆసక్తి చూపు తున్నారు. దీం తో హాస్టల్ భవనాలు అత్యధికంగా నిర్మాణాలు జరుగుతున్నాయి.
అయితే ఈ భవనాలు, గృహ నిర్మాణం కో సం అని మున్సిపాలిటీ నుంచి జీ +2 పర్మిషన్లు తీసుకొని, జీ+4,5 వ్యాపార సముదాయాలుగా నిర్మించుకుంటున్నారు. అయితే ఈ తతంగం అంతా మున్సిపల్ అధికారులకు తెలిసే జరుగుతుందని, అనుమతులకు మించి నిర్మాణా లు జరిగితే మున్సిపాలిటీకి రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు ఇవ్వాల్సిందేనని స్థానికులు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
అంతా..మామూలే
అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదుల ఒత్తిడి పెరిగితే, భవన యజమానులకు నోటీసులు ఇచ్చి, నామమాత్రపు కూల్చి వేతలు జరపడం ఇక్కడ శరమామూలుగానే కొనసాగుతుంది. మళ్లీ కొన్నిరోజుల్లోనే యథావిధిగా నిర్మా ణ పనులను కొనసాగించడం కొసమెరుపు. ఈ మున్సిపాలిటీలో ఇదంతా అంతా.. మామూలే. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోవిచ్చలవిడిగా అక్రమ నిర్మాణాల ను ప్రోత్సహిస్తున్నట్లు స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు.
స్పందించని అధికారులు...
ఆదిభట్ల మున్సిపల్ లో అక్రమ నిర్మాణాల వివరాలు గురించి సంబంధిత శాఖల అధికారులను వివరణ కోరితే మరి స్పందించడం లేదు.
అధికారుల కను సైగల్లోనే అక్రమాలు
అక్రమ నిర్మాణాల మీద పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇదంతా కూడా అధికారుల కనుసైగల్లోనే జరుగుతుంది. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికా రులు స్పందించి అక్రమాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోని, అక్రమ నిర్మాణాలను కట్టడి చేయాలని కోరుతున్నాము.
పల్లె శ్రీనివాస్ గౌడ్, ఆదిబట్ల