4 March, 2026 | 6:03 AM

ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం

04-03-2026 12:22 AM

అలంపూర్, మార్చి 3: అందరు ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా తగ్గించి వాటి స్థా నంలో బట్ట సంచులు వాడి ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా వడ్డేపల్లి ని తీర్చిదిద్దాలని శాంతినగర్ సేవా సమితి సభ్యులు ఆకాంక్షించారు. ఈ మేరకు మంగళవారం వడ్డేపల్లి మున్సిపాలిటీ శాంతినగర్ పట్టణంలో పెద్ద మసీద్ లో ముస్లిం సోదరులకు బట్ట సంచు లు పంపిణీ చేశారు. ప్లాస్టిక్ రహిత సమాజంగా పోరాటం చేస్తున్న సేవా సమితి వారి ని మైనారిటీ సోదరులు అభినందించారు. ఈ కార్యక్రమంలో రజాక్ మౌలాలి , రెహమాన్, షేక్షావలి ,రఫీ, ఇమామ్ రహీం సేవా సమితి సభ్యులు ,షేక్ అస్లాం షరీఫ్ మాలిక్, పాల్గొన్నారు.