హైరైజ్ భవనాలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
- ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ
- నిఖిల్ కరణ్, రొక్సానా ప్రాపర్టీస్ ప్రాజెక్టులకు పచ్చజెండా
- బంజారహిల్స్‌లో రెండు బహుళ అంతస్థుల నిర్మాణాలు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 3 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన బంజారాహిల్స్‌లో రెండు బహుళ అంతస్తుల హైరైజ్ భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మం జూరు చేసింది. ఈ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యే క ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ మంగళవారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
నగరంలో శరవేగంగా విస్తరిస్తున్న నిర్మాణ రంగాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ నిబంధనలకు కట్టుబడి ఉండేలా ఈ భారీ భవనాల నిర్మాణాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.బంజారాహిల్స్ పరిధిలో నిఖిల్ కరణ్, ఇతరులకు చెందిన స్థలంలో నిర్మించతలపెట్టిన భారీ భవనానికి అధికారులు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టులో స్టిల్ట్ ఫ్లోర్లకు మినహాయింపునిస్తూ, మొత్తం 10 అంతస్తులతో పాటు అదనంగా మరో రెండు టీడీఆర్ ఫ్లోర్లతో కూడిన భవన నిర్మాణానికి అనుమతులు జారీ చేశారు.
నిబంధనల మేరకు ఈ బహుళ అంతస్తుల భవనం అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకోనుంది. దీంతో పాటుగా బంజారాహి ల్స్ ప్రాంతంలోనే రొక్సానా ప్రాపర్టీస్ సంస్థ నిర్మించనున్న మరో ప్రాజెక్టుకు కూడా ప్రభు త్వం అనుమతులు మంజూరు చేసింది. రెండు సెల్లార్లు, మూడు స్టిల్ట్ ఫ్లోర్లు, 12 అంతస్తులతో కూడిన భారీ భవన నిర్మాణానికి ఈ ఉత్తర్వుల్లో లైన్ క్లియర్ చేసింది.
అయితే, హైరైజ్ భవనాలకు వర్తించే అన్ని ప్రభుత్వ నియమాలు, భవన నిర్మాణ నిబంధనలకు లోబడి మాత్రమే ఈ పనులు చేపట్టాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా అగ్నిమాపక సేవల విభాగం ఫైర్ సేఫ్టీతో పాటు భారత విమానాశ్రయ అథారిటీ నుంచి విధిగా నిరభ్యంతర పత్రాలు పొందాల్సి ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు.




