వెల్దుర్తి మండలంలో ఘనంగా హోలీ
వెల్దుర్తి, మార్చి3 : వెల్దుర్తి మండల కేంద్రంలో హోలీ పండుగ పర్వదినం సందడి వాతావరణంలో జరిగింది. ముఖ్యం గా చిన్నారులు రంగురంగుల కలర్లు చల్లి కేరింతలు కొడుతూ హోలీ వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. కాలనీలు, వీధుల్లో ఉదయం నుంచే పిల్లల అల్లరి సందడి కనిపించింది. ఒకరిపై ఒకరు రంగు లు పోసుకుంటూ, నీటి తుపాకులతో ఆడిపాడుతూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. తల్లిదండ్రుల సమక్షంలో సురక్షితంగా వేడుకలు నిర్వహించారు.
ఎటువంటి అపశృతి లేకుండా హోలీ పండుగను చిన్నారులు సంతోషంగా జరుపుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్, అలాగే ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
రేగోడ్ మండలంలో...
రేగోడు, మార్చి 3: మండల కేంద్రమైన రేగోడు తో పాటు ఆయా గ్రామాలలో మంగళవారం యువకులు పెద్దలు చిన్న పిల్లలు రంగులు ఒకరికి ఒకరు ఆనందంగా రంగు చల్లుకుంటూ హోలీ పండుగను ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుభాష్ పటేల్, రామా గౌడ్, నాలా చెరువు రాధాకిషన్, రాచోటి నిఖిల్, అమృత్, ఎల్లా గౌడ్ , కృష్ణమూర్తి యాదవ్, రాజు కమల్, సిద్దు, రమేష్, శ్రీనివాస్, రా ములు, ఆర్‌ఎంపీ డాక్టర్ అనిల్, తదితరులు పాల్గొన్నారు.




