వ్యవసాయ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
- రైతు బిడ్డలకు నాణ్యమైన విద్య అందాలి
అసెంబ్లీ సమావేశాలలో ఎమ్మెల్యే మదన్ మోహన్
ఎల్లారెడ్డి, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): రాష్ట్రంలో వ్యవసాయ విద్యను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ,అన్నారు. శాసనసభ సమావేశాల్లో వ్యవసాయ విద్య, ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల బలోపేతం, విద్యార్థులకు మెరుగైన వసతులు వంటి అంశాలపై తాను మాట్లాడినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం రైతు ప్రభుత్వం.
ప్రతి రైతు బిడ్డకు నాణ్యమైన వ్యవసాయ విద్య అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రైతు బిడ్డలు భవిష్యత్తులో వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎదగాలంటే వ్యవసాయ విద్యకు బలమైన పునాది అని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. మాల్తుమ్మెద పాలిటెక్నిక్ను పునరుద్ధరించాలి కామారెడ్డి జిల్లాలోని , ఎల్లారెడ్డి నియోజకవర్ వర్గంలోని నాగిరెడ్డిపేట మండలం మాల్ తుమ్మెద, లో 2014లో ఏర్పాటు చేసిన వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం, వసతుల మెరుగుదల కోసం తాత్కాలికంగా సిద్ధిపేట జిల్లా తొర్నాలకు తరలించిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ముఖ్యంగా ఎల్లారెడ్డి ప్రాంతానికి చెందిన రైతు కుటుంబాల పిల్లలు వ్యవసాయ విద్యకు దూరం కాకుండా ఉండేందుకు, మాల్తుమ్మెదలో ఉన్న సీడ్ ఫార్మ్లోనే పూర్తిస్థాయి వసతులతో వ్యవసాయ పాలిటెక్నిక్ను తిరిగి ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు.ఎల్లారెడ్డిని కేంద్రంగా చేసుకుని కొత్త అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఏర్పాటు చేసే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని శాసనసభలో విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.