15 April, 2026 | 12:38 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రభుత్వం రైతు, పేదల పక్షపాతి

09-04-2025 02:14 AM

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన విప్పు బీర్ల ఐలయ్య 

యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 8 ( విజయ క్రాంతి ) : యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మంగళవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు పండించిన ప్రతి గింజను  ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు. రైతులు తీసుకువచ్చే ధాన్యాన్ని త్వరతగతిన కొనుగోలు చేసి అమ్మిన మూడు రోజుల్లోనే వారి ఖాతాలోకి డబ్బులు జమ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతన్నల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారని అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ రైతన్నలకు మద్దతు ధర కల్పిస్తున్నామన్నారు. మాసాయిపేట గ్రామ చెరువులోకి నీళ్లు తీసుకురాలేదని ప్రతిపక్షాలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.  ఎన్ని నిధులైన ఖర్చు చేసి మా సాయి పేట గ్రామ చెరువును నింపి గ్రామ ప్రజల రైతుల కాలు కడుగుతానని అన్నారు.