17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పారా ఒలంపిక్స్ స్వర్ణ పతక విజేత దీప్తి జీవాంజీకి సన్మానం

09-04-2025 02:15 AM

మహబూబాబాద్, ఏప్రిల్ 8, (విజయ క్రాంతి): పార ఒలంపిక్స్ లో బంగారు పతకం సాధించడంతోపాటు భారత ప్రభుత్వ అర్జున అవార్డు పొందిన తెలంగాణకు చెందిన దీప్తి జీవాంజిని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కాళోజి వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. సమీప బంధువులకి వచ్చిన దీప్తి జీవాంజినీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నామిరెడ్డి వెంకట్ రెడ్డి, ముఖ్య సలహాదారు మైస శ్రీనివాసులు ఆధ్వర్యంలో సభ్యులు ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న దీప్తి ఆత్మస్థైర్యం కోల్పోకుండా అంచలంచలుగా ఎదుగుతూ అథ్లెటిక్స్ లో ప్రతిభ చూపి జపాన్లో జరిగిన పారా ఒలంపిక్స్ లో బంగారు పథకాన్ని సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమేనని దీప్తి నిరూపించారని, దీప్తి స్పూర్తితో యువత క్రీడారంగంలో రాణించడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పట్టాభి లక్ష్మయ్య, కోశాధికారి సోమ విష్ణువర్ధన్, మైస నాగయ్య, గూడూరు నాగేశ్వరరావు, దేవుడి మధుసూదన్ రెడ్డి, కుంజా రాంబాబు, వెంకటేశ్వర్లు, శ్యామ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.