25 April, 2026 | 3:21 AM

ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

25-04-2026 01:33 AM

కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్, ఏప్రిల్24(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికుల సమ్మెను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర మంత్రి బండి సంజ య్ విమర్శలు గుప్పించారు. గత బీఆర్‌ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని అన్నారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య బాధాకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ‘ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కార్మికుడి ఆత్మహత్య.. ఇది ప్రభుత్వ హత్య’ అం టూ వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వం బెదిరిస్తోందని ఆరోపించారు. ఇంత పెద్ద సమ్మె జరిగితే.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు బీఆర్ ఎస్ సర్కార్ చేసిన తప్పే.. కాంగ్రెస్ చేస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో కూ డా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో 28వ పేజీలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. రెండు పీఆర్సీలు చెల్లిస్తామని హామీ ఇచ్చారంటూ కాంగ్రెస్ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి చదివి వినిపించారు. ఆర్టీసీ సమస్యలపై బీజేపీ పోరాడితే.. ఓటు కాంగ్రెస్కు వేశారని అన్నారు.

ఆర్ ర్టీసీ కార్మికులు సమ్మెకు పోవడం దురదృష్టకరం : మాజీ మంత్రి బి ఆర్ ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి 

జగిత్యాల, ఏప్రిల్ 24 ( విజయక్రాంతి ) :జగిత్యాల పట్టణంలోని ఆర్ ర్టీసీ డిపో ముందర ఆర్ ర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మెకు మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మద్దతు తెలిపారు.ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ...ఆర్ ర్టీసీ కార్మికులు సమ్మెకు పోవడం దురదృష్టకరంప్రభుత్వ నిర్లక్షం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని,గత ప్రభుత్వం ఆర్ ర్టీసీ నీ ప్రభుత్వంలో విలీనం చేయాలని చర్చించటం జరిగిందన్నారు.గతంలో ఆర్ ర్టీసీ విలీన ప్రతిపాదన శాసన సభలో, శాసన మండలిలో ఏకగ్రీవ ఆమోదం తెలుపడం జరిగింది గతంలో ఉద్యమ బలోపేతం గు రించి ప్రధాన పాత్ర పోషించింది ఆర్ ర్టీసీ కార్మికులు అని, ఈ ప్రభుత్వం ఆర్ ర్టీసీ సమస్యలపైన ఎందుకు జాప్యం చేస్తుందన్నారు.

ఆర్ ర్టీసీ ప్రభుత్వ రంగ సంస్థ దీనిని బలోపేతం చేసుకోవాలి మహాలక్ష్మి పథకం అమలు కారణం ఆర్ ర్టీసీ సంస్థ ఆర్ ర్టీసీ కార్మికులన్నారు.ఆక్యుపెన్సీ పెరిగింది బస్ ల సంఖ్య పెంచాలి కానీ ఉన్న బస్ డిపో లను తీసివేస్తున్నారు.శంకర్ గౌడ్  మరణం ప్రభుత్వానికి చెంప పెట్టు ఆర్ ర్టీసీ కార్మికులు రోడ్ ఎక్కడానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా కారణం ప్రభుత్వ ఆస్తులు అమ్మకమే రేవంత్ రెడ్డి ఆదాయం ఆర్ ర్టీసీ సంస్థ ను ప్రైవేటీకరణ చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యంమంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇందులో బాధ్యుడన్నారు.వేత బత్యాల సవరణ రాజ్యాంగం కల్పించిన హక్కుఎలక్ట్రిక్ బస్సులు ఆర్ ర్టీసీ సంస్థ కి ఇచ్చినట్లయితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయిఆర్ ర్టీసీ కార్మికుల ఆత్మహుతి బలిదానాలు సమస్యలకు పరిష్కారం కాదు ఓపిక పట్టండి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంనకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ఈ ఉద్యమము శంకర్ గౌడ్ మరణం ఆనాటి శ్రీకాంత చారి బలిదానం తలపిస్తుందని,శంకర్ గౌడ్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలిశంకర్ గౌడ్ మృతి తో రేవంత్ రెడ్డి కళ్ళు తెరవాలి ,ఈ రోజు చర్చలు కాదు సమస్యలకు పరిష్కారం కావాలి , ఈ ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలు చదువుకొండి,శంకర్ గౌడ్  మరణం చాలా బాధ అనిపించింది,ఇది పునరావుతం కాకూడదు,శంకర్ గౌడ్ కుటుంబానికి కార్మికుల పక్షాన కూడా తోడుగా ఉందాం,ఆర్ ర్టీసీ కా ర్మికుల సమస్యలను అన్నింటిని ఈ ప్రభు త్వం పరిష్కరించాలి,ఇప్పుడూ యూనియన్ల అవసరం ఉంది యూనియన్ల పునరుద్ధరణ చేయాలి ,సమ్మె కార్మికుల హక్కు శంకర్ గౌడ్ ఆత్మకి శాంతి చేకురాలి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఈ ప్రభుత్వం ను డిమాం డ్ చేస్తున్నాను.ఈ కార్యక్రమం లో ఆర్ ర్టీసీ కార్మికులు, బి ఆర్ ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ న్యాయపరమైన డిమాండ్ లను  నెరవేర్చాలినగర మేయర్ కొలగాని శ్రీనివాస్ 

ముకరంపుర , ఏప్రిల్ 24(విజయ క్రాంతి) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సం స్థ కార్మీకుల న్యాయమైన డిమాండ్లను ప్రభు త్వం వెంటనే నెరవేర్చాలని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కరీంనగర్ లో శుక్రవారం రోజు ఆర్టీసీ జేఏసి కార్మీకుల కు మద్దతు తెలుపారు. ఆర్టీసీ డిపో వద్ద కార్మీకులతో కలిసి ఆంధోళనలో పాల్గొని నిరసన తెలిపారు. కార్మీకులకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు బస్టాండ్ నుండి కార్మీకులతో కలిసి  అమరవీరుల స్థూపం వరకు మేయర్ శాంతి ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ...సంతాపం ప్రకటించారు. 

ఈ సంధర్బంగా మేయర్ కొలగాని శ్రీనివాస్ మాట్లాడుతూ....ఆర్టీసిని ప్రభుత్వం లో విలీనం చేస్తూ... కార్మీకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు చంద్ర, దేవసాని సరస్వతి, మాసం గణేష్, తోట అనిల్ మరియు ఆర్టీసీ యూనియన్ నాయకులు,  కార్మీకులు పాల్గొన్నారు.