దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
బోయినపల్లి: మార్చి 4 (విజయక్రాంతి): ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతన నిర్మాణం చేసిన వేణుగోపాల స్వామి వెంకటస్వామి రాజరాజేశ్వర ఆలయాల విగ్రహ ప్రతిష్టాపనకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాలు ఉండడం ప్రజల ఐక్యతకు సామాజిక వ్యక్తిత్వాలకు నిదర్శనం అన్నారు.
అంతేకాకుండా ప్రజలు సమిష్టిగా ఉండి భక్తితో అందరి కలిసి పోతారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కూడా ఆలయాల అభివృద్ధికి వాటి అభ్యున్నతికి కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తెరపాక మంజుల సుధాకర్, ఉప సర్పంచ్ గోపాల్, మాజీ సింగిల్ విండో చైర్మన్ జోగినపల్లి వెంకట రామారావు, కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు కోమ్మనబోయిన సువీన్ యాదవ్, సర్పంచులు మహేశ్వర్ రెడ్డి, కనకయ్య తదితరులున్నారు.






