రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
మొంథా తుఫాను కారణంగా తెలంగాణలో రైతులు పండించిన పంట పూర్తిగా నీటి పాలయ్యింది. వర్షం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు తడిసిపోయి అవి మొలకెత్తాయి. దీంతో రైతులు ఏం చేయాలో పాలుపోక దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కాబట్టి రాష్ర్ట ప్రభుత్వ వెంటనే క్షేత్ర స్థాయిలో కలియ తిరిగి పంట నష్టంపై అంచనా వేసి ప్రతి రైతుకు ఆర్థిక సాయం అందించి వారికి న్యాయం జరిగేలా చూడాల్సిన అవసరముంది.
అవసరం లేని వానలతో రైతన్నలు తమ నోటి దాకా వచ్చిన ముద్దను అమ్ముకునేందుకు వీలు లేకుండా పోయింది. ఇక రాష్ర్టంలో అన్ని వస్తువులకు బీమా ఉంటుంది, కానీ రైతులు పండించిన పంటకు మాత్రం బీమా లేదు. రైతులు ఆరుకాలం శ్రమించి పండించిన పంటను ప్రతీసారి అకాల వర్షాలు ముం చెత్తడం.. ఆపై వరదలో పంటలు కొట్టుకుపోవడం సర్వ సాధారణమైపోతుంది.
అందుకే ప్రభుత్వం దీనికి శాశ్వత పరిష్కారాన్ని ఆలో చించాల్సిన అవసరముంది. రైతులు మార్కెట్‌కు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా వ్యవసాయ అధికారులు ఏర్పాట్లు చేయాలి. ప్రస్తుతం తడిసిన ధాన్యాన్ని రాష్ర్ట ప్రభుత్వం కొనుగోలు చేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం కూడా అందించాలని కోరుతున్నాం.
మిద్దె సురేష్, నాగర్‌కర్నూల్






