అప్పులతోనేనా మన అభివృద్ధి!
ఒకప్పుడు అప్పు అంటే భయం. నేడు ప్రియంగా మారింది అంటే అతిశయోక్తికాదు. దేశ జీడీపీ 2023 173.82 లక్షల కోట్లు కాగా, దాదా పు దీనిలో సరిసమానమైన మొత్తం అప్పు లు రూపంలో వివిధ బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు నుంచి మన దేశ ప్రజలు వ్యక్తిగతంగా అప్పులు తీసుకున్నట్లు కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడించింది. ఈ అప్పుల్లో మన తెలుగు రాష్ట్రాలు మొదటి రెండు స్థానాల్లో నిలవ డం గమనార్హం.
అయితే అప్పులు చేయడంలో ఒక అడుగు ముందుకేసిన ఆంధ్ర ప్రదేశ్ 43.7 శాతంతో మొదటి స్థానంలో ఉంటే.. 37.2 శాతంతో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. పూర్వం ఒక రెండు దశాబ్దాల క్రితం వరకూ, డబ్బులు ఉంటేనే ఏ వస్తువు అయినా కొనడం, ఇల్లు కట్టుకోవ డం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగేది. అయితే ఇటీవల కాలంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకున్న ము ఖ్యంగా మధ్యతరగతి ప్రజలు వచ్చే ఆదా యం కన్నా ఎక్కువ ఖర్చు చేయడానికి అలవాటు పడ్డారు. దీనికి తోడు, బ్యాం కులు, ఇతర ఫైనాన్స్ సంస్థలు అప్పులు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి.
ఇక ప్రైవేటు బ్యాంకులు, సంస్థలు నియమ నిబంధనలను మరింత సరళీకృతం చేసి ఇంటి వద్దకే అప్పులు ఇచ్చే సదవకాశాలు కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్ సిస్టమ్ ద్వారా ద్వారా, వ్యక్తిగత గ్యారంటీ ద్వారా పరిమితి కి రుణాలు ఇవ్వడంతో దేశంలో అప్పులేని వ్యక్తి లేడు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి.
అవసరానికి మించి ఆస్తులు ఉండాలన్న ఆశతో సామాన్యులు ఎగబడుతుంటే.. గ్రృహాలు, కార్లు, స్థలాలు, పొలా లు, గ్రహోపకరణాలు ఇలా ఏవి కొనడానికి అయినా రుణాలు ఇచ్చేందుకు తాము సిద్ధమంటూ బ్యాంకులు, ఫైనాన్షియర్లు ముందుకు వస్తున్నారు. ఇందులో కొంతమంది రుణాల ద్వారా అభివృద్ధి చెందు తుంటే, చాలా మంది మాత్రం రుణగ్రస్థులుగా మారిపోతున్నారు.
విచ్చలవిడి ఖర్చులు
ఆదాయానికి మించి అప్పులు చేయడంతో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు. వివాహాలు, బర్త్ డే వేడుకలు, శుభకార్యాల కోసం అప్పులు చేయడంతో చాలా కుటుంబాల్లో చీకటి అలుముకుంటున్న పరిస్థితి ఏర్పడింది. ‘క్రెడిట్ కార్డు’ అందుబాటులోకి రావడంతో అనవసర ఖర్చులు పెరిగిపోతున్నాయి. పరిమితికి మించి క్రెడిట్ కార్డుల వాడకం వల్ల జీవితమంతా అప్పులు, వడ్డీలు కట్టడానికే సరిపోతుంది.
ఆన్‌లైన్ షాపింగ్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, మీషో, జొమోటో, స్విగ్గీ, బ్లింకిట్ ఇలా వివిధ రకాల సంస్థలు ఆన్లున్ ద్వారా వస్తువులు, సరుకులు ఇంటి కే తెచ్చిస్తుండడం, ఆఫర్ల మోజులో పడి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తున్నారు. తద్వా రా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. దీంతో ఆర్థికంగా, ఆరోగ్య పరంగానూ క్షీణిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక అవసరా లు పెరిగిపోవడంతో ఎంత సంపాదించినా, సరిపోని పరిస్థితి నెలకొంది..
విలా సాలు, వినోదాలు, పార్టీలు, గెట్ టుగెదర్, వీకెండ్ పార్టీలు, రకరకాల టూరిజం పర్యటనలు చేస్తూ తమను తాము మరింత అప్పుల ఊబిలోకి నెట్టేసుకుంటున్నారు. ఇ క పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్, డి మార్ట్, రిలయన్స్, విజేత, మోర్, విశాల్, వస్త్ర దుకాణాలు, లూలు మాల్స్, గృహోపకరణాలు, మొబైల్, బైక్, కార్ల షోరూంల ఏ ర్పాటు పెరిగిపోవడం, ఆఫర్ల పేరుతో సామాన్యుల జేబులు ఖాళీ చేయడం పరిపాటైపోయింది.
అవసరం ఉన్నా లేకున్నా పరువుకు పోతున్న కొందరు ఖరీదైన ఫోన్లు, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్న కుటుంబాలు కోకొల్లలు. ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణా ది రాష్ట్రాల ప్రజలు అప్పుల్లో మునిగి తేలుతున్నారని పలు నివేదికలు వెల్లడించాయి.
గ్రామీణ ప్రాంతాలే అధికం
పట్టణ ప్రజలు కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలే ఎక్కువ అప్పుల్లో ఉన్నట్లు సర్వేల్లో బయటపడడం ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యేలా చేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఇప్పటీ జనరేషన్ జెడ్ యువతే. సోకులకు మరిగిన ఇప్పటి జెన్ జెడ్ యువత వివిధ రకాల లగ్జరీలకు అలవా టు పడడంతో తల్లిదండ్రులను హింసించి మరీ బైకులు, ఫోన్లు, కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు మిడిమిడి జ్ఞా నంతో ‘స్టాక్ మార్కెట్’లో పెట్టుబడులు పె ట్టి అప్పుల పాలవుతున్నారు. ఇంకొందరు ఆన్‌లైన్ గేమ్స్, రమ్మీ వంటి వాటికి వ్యసనపరులై కుప్పలుతెప్పలుగా అప్పులు చేస్తున్నారు.
విలాసవంతమైన ఇళ్ల నిర్మాణాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, విలా సవంతమైన జీవితం కోసం ఆదాయానికి మించి ఖర్చు చేయడం, అప్పులు చేయడంతో జీవితాన్ని నరకప్రాయం చేసుకో వడం జరుగుతుంది. ఆదాయానికి మించి ఖర్చు చేయడం ఎప్పుడూ ప్రమాదమే అని గ్రహించాలి. పొదుపు చేయడం జీవితంలో ఒక భాగంగా ఉండాలి. అవసరం మేరకు వస్తువులు కొనాలి. ఆఫర్లు మోజు లో పడరాదు.
తక్కువ వడ్డీలు, ఈఎంఐల సౌకర్యాలు, క్రెడిట్ కార్డు వంటి వ్యామోహంలో పడరాదు. ఉన్నంతలో ఉన్నతంగా బతికేందుకు, భవిష్యత్తుకు భరోసా కల్పించుకోవాల్సిన అవసరముంది. అప్పులకు ఆమడదూరంలో ఉండడం శ్రేయుష్కరం అందరూ ఆనందంగా ఉండాలంటే ఉన్నంతలో సంతోషంగా బ్రతకాలి.. అనవసర మైన ఖర్చులు తగ్గించుకోవాలి. జీఎస్టీ తగ్గిందని అతిగా కొనకుండా వీలైనంత మేర పొదుపు చేయడం మంచిది.
కొండలా బకాయిలు
ఇక సామాన్య ప్రజల పరిస్థితి అలా ఉంటే రాష్ట్రాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయా ప్రభుత్వాలు విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నాయి. దేశ చరిత్రలోనే అత్యధికంగా 2020 రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 7.89 లక్షల కోట్ల అప్పులు చేశాయి. 2022 రూ. 6.42 లక్షల కోట్లు సేకరించాయి. 2024 2025 ఈ సంఖ్య పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గడం లేదు.
రాష్ట్రాలకు ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగకపోతే కొండలా పేరుకుపోయిన అప్పులను తీర్చడానికే మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. ఇప్పటికీ కొన్ని రా ష్ట్రాలు, ప్రభుత్వ రంగ సంస్థలు పాత అప్పులు తీర్చడానికి కొత్త రుణాలు తీసుకుంటూ సర్దుబాట్లతో కాలం వెళ్లదీస్తు న్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో పాత అప్పులు చెల్లించేందుకు కొతత రుణాలు తీసుకోవడం అధికమవుతోంది.
రాష్ట్రాలు సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల పేరుతో విచ్చలవిడిగా ఎడపెడా అప్పులు చేస్తున్నా యి. ఆదాయం వచ్చే పథకాలపై అప్పులు తెచ్చి పెడితే తిరిగి తీర్చడానికి మార్గం ఉం టుంది. ఓట్ల రాజకీయాలతో పేదల సంక్షే మం పేరు చెప్పి తెచ్చే అప్పులను ఎలా వినియోగిస్తున్నారనేది ఎవరూ పట్టించుకోవడం లేదు.
ఆర్థిక సంక్షోభమే!
కేరళ, రాజస్థాన్, మహారాష్ట్ర పాత ప న్ను బకాయిలను వసూలు చేసుకుని ఆదా యం పెంచుకోవడానికి రాయితీ పథకం ప్రారంభించాయి. పంజాబ్‌లో పన్ను వ సూళ్లు పెంచేందుకు ప్రత్యేక విభాగం ఏ ర్పాటు చేశారు. పలు రాష్ట్రాల్లో 2020 నుంచి నిర్వహణ వ్యయం భారీగా పెరుగుతోంది. అప్పులు తీర్చి ఆదాయం పెం చుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు ఉండకపోతే వెనెజులా, శ్రీలంక, జిం బాబ్వే వంటి దేశాల మాదిరిగా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే ప్రమాదం ఉందని గుర్తించాలి.
ప్రజలను మాయ చేసి ఓట్లు దండుకోవాలనే లక్ష్యాలతో ప్రజాకర్షక, ఉచిత పథకాల అమలుకు వేల కోట్ల రూ పాయాలను గుమ్మరించేందుకు ఎడాపెడా అప్పులు చేస్తున్నారు. ఆ బాకీలను తిరిగి కట్టాలంటే ప్రజలపై ఏదో ఒక రూపంలో పన్నులు వడ్డించి సొమ్ము రాబట్టాల్సిందే.
దేశ రాజధాని న్యూఢిల్లీలో అప్పు తక్కువ ఉన్న ప్రజలు ఎక్కువగా ఉండడం హర్షించదగ్గ విషయం.. దేశ వ్యాప్తంగా చూస్తే ప్రతీ లక్ష మందికి 60,093 మంది సగటు న అప్పుల ఊబిలో ఉన్నారు... అప్పులతో స్థిరాస్తులు సమకూర్చుకోవడం మంచిదే, అభివృద్ధి చెందడం ఆహ్వానించదగ్గ అం శమే అయినప్పటికీ ఎంతమంది అప్పుల తో అభివృద్ధి చెందారన్నది బిలియన్ డా లర్ల ప్రశ్నగా మారింది.






