15 April, 2026 | 9:30 AM

సోషల్ వర్క్ కోర్సుకు ప్రాధాన్యమేదీ?

02-11-2025 12:00 AM

సోషల్ వర్క్ సమాజంలో ఉన్న అనేక రుగ్మతలను రూపుమాపడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. వాస్తవానికి సామాజిక కార్యకర్తలు సమూహంగా కేవలం తాత్కాలిక ఉపశమనం కల్పించి అండగా నిలిచే కార్యక్రమాలు చేస్తుంటారు. అయితే సోషల్ వర్క్ విద్య కేవలం ఆ వ్యక్తి కోసం కాకుండా చుట్టూ ఉన్న సమాజాన్ని అర్థం చేసుకునే పరిశీలనాత్మక విద్యగా చెప్పవచ్చు. అటువంటి పరిశీలనాత్మక విద్య వల్లనే సమాజంలో శాశ్వత అభివృద్ధికి బీజం పడుతుంది.

కానీ భారత్‌లో సోషల్ వర్క్ విద్యకు సరైన ప్రాధాన్యం కల్పించక నిర్లక్ష్యం చేయడం ఒక కారణమైతే.. దీనిని వృత్తి విద్యా కోర్సుగా గుర్తించకపోవడం వల్ల అనేకమంది ఈ కోర్సు చదివినా అవకాశాలు లభించే పరిస్థితులు లేవు అన్నది వాస్తవం. దీనికి ప్రత్యేక కారణం సోషల్ వర్క్ విద్యకు ప్రత్యేకమైన కౌన్సిల్ లేకపోవడం అని కూడా చెప్పవచ్చు. ఆసియా దేశాల్లో శతాబ్ధాల పూర్వమే ఈ వృత్తి విద్యా కోర్సు ఉండడంతో అక్కడ సమాజం, పరిశ్రమలు, ప్రకృతి, లింగ వివక్షత లాంటివి లేకుండా గుణాత్మకతను కలిగి ఉన్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో విద్యార్థుల మానసిక దృఢత్వం కోసం కౌన్సిలర్లను ఏర్పాటు చేయడానికి సోషల్ వర్కర్లను నియమించి ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థుల మరణాలు జరగకుండా అడ్డుకోవాల్సిన అవసరముంది. ఆ దిశగా ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకొని సోషల్ మీడియా విద్యనభ్యసించిన వారితో ఈ పోస్టులను తక్షణమే భర్తీ చేయాల్సిన అవ సరముంది.

 సంపత్‌కుమార్, కరీంనగర్