సభలో బుల్డోజర్ నడిపిన ప్రభుత్వం
- ప్రజలపై చోర్ మోడల్ పాలన
- కేటీఆర్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్, మార్చి 18: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం బుల్డోజర్ నడిపిందంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంలో సబ్జెక్టు లేదన్నారు. అసెంబ్లీలో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ ప్రభుత్వం వ్యవహరించిందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి వీధి రౌడీలా మాట్లాడుతున్నాని మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకులనే తొక్కుకుంటూ వచ్చి, పేమెంట్ కోటాలో వెయ్యి కోట్లు ఢిల్లీకి ఇచ్చి సీటు తెచ్చుకున్నారని ప్రజలు అనుకుంటున్నారు వ్యాఖ్యానించారు. ఇది చోర్ మోడల్, 420 మోడల్ పాలన అని విమర్శించారు. బడ్జెట్ సెషనా, కాంగ్రెస్ హిస్టరీ సెషనా అర్థం కాలేదన్నారు. గురుకులాల్లో విద్యార్థులు విషాహారం తిని చనిపోతున్నా స్పందన లేదు అని విమర్శించారు.
మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి జరుగుతోందని ఆరోపించారు. రెండున్నర సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు కానీ వేలాది ఇండ్లు కూల్చేశారని మండిపడ్డారు. కేసీఆర్ చేసిన అప్పు 2.80 లక్షల కోట్లు అని కేంద్రం చెబుతుంటే, 8 లక్షల కోట్లు అని అబద్ధాలు చెపుతున్నారని పేర్కొన్నారు. దోపిడీని మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటామన్నారు.




