17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రైతు మేలే ప్రభుత్వ లక్ష్యం

21-04-2025 01:05 AM

ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): రైతు మేలే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని , రైతు కళ్ళల్లో ఆనందం నింపేందుకే సన్న వడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ప్రకటించడం జరిగిందని, ఈ యాసంగిలో కూడా బోనస్ చెల్లించడం జరుగుతుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. నెల్లికుదురు మండలంలోని వివిధ గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరువాలం కష్టపడి పండించిన పంటను గత ప్రభుత్వంలో వివిధ రకాల కోతల పేరుతో ధాన్యాన్ని దండుకొని రైతులకు అనేక విధాలుగా దోచుకున్న సంఘటనలు జరిగాయని, ఇప్పుడు తమ ప్రభుత్వం అందుకు పూర్తిగా భిన్నంగా, పారదర్శకంగా ధాన్యం కొనుగోలు చేస్తుందని చెప్పారు.

అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట ఉత్పత్తులను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని, కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఎమ్మెల్యే అన్నారు.