23 June, 2026 | 5:23 PM

Breaking News

రోడ్డు ప్రమాదంలో డాన్స్ మాస్టర్ మృతి   •   రెవిన్యూ రికార్డులను పరిశీలించిన కలెక్టర్   •   బిగ్ డేటా యుగంలో ఈ-కామర్స్ భద్రతపై పరిశోధనకు పీహెచ్‌డీ   •   మాదిగల్లో అక్షరాస్యత పెంపుకు 40 రోజుల "గో టు విలేజ్" కార్యక్రమం   •   నెల్లిపాక భూములపై ప్రొహిబిషన్ ఎత్తివేయాలి   •   విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటేనే బంగారు భవిష్యత్   •   ఐఎస్‌ సదన్‌లో భారీ చోరీ.. రూ.17 లక్షలతో పరారైన ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్   •   రైతులకు అందుబాటులో విత్తన మేళ   •   తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టి పెల్లి సైదులు ఎన్నిక   •   ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ   •  

గ్రాండ్ సూపర్ హీరో వచ్చేశాడు!

18-03-2026 01:44 AM

బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో: ఏలియన్స్ కా ఆగమన్’. జీ స్టూడియోస్ సమర్పణలో మనీష్ సైనీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సరికొత్త ఫాంటసీ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో ప్రతీక్ బబ్బర్, భాగ్యశ్రీ, శరత్ సక్సేనా, సాహర్ష్ శుక్లా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుందీ చిత్రం.

తాజాగా చిత్రబృందం ఈ మూవీ ఫస్ట్‌లుక్ టీజర్‌ను విడుదల చేసింది. ఒక పాఠశాల విద్యార్థి తన కుటుంబ రహస్యం గురించి స్నేహితుడితో చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తన తాతయ్యకు అద్భుత శక్తులు ఉన్నాయని,  ఆ విషయం బయటపడితే తాతయ్య శక్తులు కోల్పోవడమే కాకుండా, భూమిపై ఏలియన్స్ దాడి చేసే అవకాశం ఉందని ఆ బాలుడు భయపడతాడు. ఇక టీజర్ చివరలో జాకీ ష్రాఫ్ సూపర్ హీరో కాస్ట్యూమ్‌లో మెరిసి ఆశ్చర్యపరిచారు. 1985లో వచ్చిన ‘శివ కా ఇన్సాఫ్’లో ఆయన సూపర్ హీరో పాత్రలో కనిపించారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఆ పాత్రలో అలరించనున్నారు.