30 April, 2026 | 3:30 AM

హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

30-04-2026 02:11 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 29 (విజయక్రాంతి): సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పట్టణంలోని కె.ఎల్.ఆర్ కాలనీలోని చత్రపతి శివాజీ చౌరస్తా విగ్రహం వద్ద ఈనెల 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని హిందూ సాహిత్య పరిషత్ నాయకులు బిజెపి నేత పడాల రఘురాం పటేల్ కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందూ సమ్మేళన కార్యక్రమానికి మేడ్చల్ నగరంలోని కేఎల్‌ఆర్,బాలాజీ నగర్ కాలనీ లతో పాటు సకల జనుల బస్తీలో తిరిగి ప్రజలకు ఆహ్వాన పత్రాలు పంపిణీ చేసి ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు పాతూరి సుధాకర్ రెడ్డి.బిజెపి నేత అడ్వకేట్ పికెట్ నర్సింగ్ రావు పాల్గొన్నారు.