5 September, 2026 | 10:44 AM

మాజీ మంత్రి హరీశ్ రావు హౌస్ అరెస్ట్

27-08-2026 | 09:35am

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావును కోకాపేటలోని నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్(Harish Rao house Arrest) చేశారు. వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లకుండా హరీశ్ రావు ను పోలీసులు అడ్డుకున్నారు. వరంగల్ జిల్లాలో జీవో 97 రద్దు చేయాలని నిరసన చేస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు(Polytechnic student) సంఘీభావం తెలిపేందుకు హరీశ్ రావు వరంగల్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. వరంగల్ కు పోకుండా హరీశ్ రావును ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు