31 March, 2026 | 3:19 AM

పశ్చిమాసియాలో యుద్ధ బీభత్సం

31-03-2026 01:23 AM

టెహ్రాన్‌పై విరుచుకుపడిన ఇజ్రాయెల్

విద్యుత్ కోతలు, అంతా అంధకారం

కువైట్‌లో విద్యుత్, నీటి శుద్ధి ప్లాంట్లపై దాడి.. భారతీయుడు మృతి 

24 గంటల్లో 38 క్షిపణులు, డ్రోన్లను కూల్చివేసిన యూఏఈ

దక్షిణ లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి ఓ సభ్యుడు మృతి

ఇరాన్ క్షిపణి దాడి.. హైఫా చమురు డిపోలో అగ్నిప్రమాదం

ఇరాక్ వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి

లెబనాన్‌లో 1,238కి చేరిన మృతుల సంఖ్య 

టెహ్రాన్/ బాగ్దాద్/ మార్చి 30: మశ్చిమాసియాలో యుద్ధం బీభత్సం కొనసాగుతోం ది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో రాకెట్లు, డ్రోన్లు, క్షిపణుల వర్షం కురింది. బీరుట్, లెబనాన్, అటువైపు కువైట్, సౌదీఅరేబియా, ఇజ్రాయెల్ తదితర ప్రాంతాల్లో ప్రతీకారదాడులు కొనసాగాయి. రోజురోజుకూ దాడులు ఉధృతం అవుతుండడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థతులు నెలకొన్నా యి. ఇరాన్‌లోని పాఠశాల, స్పోరట్స్ హాల్‌పై కొత్త అమెరికా క్షిపణి దాడి చేసింది.  దక్షిణ ఇరాన్‌లో ఒక సైనిక కాంపౌండ్ సమీపంలో ఉన్న స్పోరట్స్ హాల్, దాని పక్కనే ఉన్న పాఠశాలపై కొత్తగా అభివృద్ధి చేసిన అమెరికా బాలిస్టిక్ క్షిపణి దాడి చేసి ఉండవచ్చని న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తులో తేలింది.

ఈ దాడిలో ప్రెసిషన్ స్ట్రైక్ మిస్సైల్‌ను ఉపయోగించినట్లు సమాచారం. టెహ్రాన్ అంతటా ఇజ్రాయెల్ దాడులు చేసింది. బహ్రెయిన్‌లో హెచ్చరిక సైరన్లు వెలువడ్డాయి. సోమవారం ఉదయం టెహ్రాన్ వ్యాప్తంగా ‘సైనిక మౌలిక సదుపాయాలను‘ లక్ష్యంగా చేసుకుని దాడు లు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. తెల్ల వారుజామున, ఇరాన్ ఇజ్రాయెల్ వైపు క్షిపణులను ప్రయోగించిందని కూడా ఇజ్రా యెల్ నివేదించింది. ఇదిలా ఉండగా, సోమవారం తెల్లవారుజామున బహ్రెయిన్ క్షిపణి హెచ్చరిక సైరన్లను మోగించింది.

విదేశీ ఏజెన్సీల ప్రకారం.. ఆదివారం రాత్రి ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై రెండు విడతల వైమానిక దాడులు జరిగాయి. దీనికి ప్రతిస్పం దనగా దేశ వాయు రక్షణ వ్యవస్థలు అప్రమత్తం అయ్యాయి. ఈ దాడుల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి, అనేక ప్రాంతాలు అంధ కారమయ్యాయి. టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ తాజా దాడులు చేసింది. ఇరాన్ ప్రతీకార క్షిపణి దాడులను కొనసాగిస్తున్నప్పటికీ, సైని క మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని టెహ్రాన్‌పై తమ వైమానిక దళం దాడు లు నిర్వహించిందని ఇజ్రాయెల్ తెలిపింది. గత 24 గంటల్లో, ఇజ్రాయెల్ మధ్య, పశ్చి మ ఇరాన్‌లోని కీలక సదుపాయాలతో సహా 140కి పైగా వైమానిక దాడులు నిర్వహించింది. 

మెహ్రాబాద్ విమానాశ్రయం, తబ్రిజ్ లోని పెట్రోకెమికల్ ప్లాంట్‌కు నష్టం వాటిల్లిందని ఇరాన్ మీడియా నివేదించింది. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలలో ఇజ్రాయెల్ సైన్యం తన కార్యకలాపాలను కొనసా గిస్తోందని, ఏడు ప్రాంతాల నివాసితులను వారి ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించిందని తెలిపింది. జాబితాలో ఉన్న ప్రాంతాల్లో హారెట్ హ్రీక్, ఘో బేరీ, లైలాకీ, హద్దాద్, బోర్జ్ ఎల్-బ్రాజ్నే, తౌ హిదత్ అల్-ఘాదిర్, షియా ఉన్నాయి. ఈ ప్రదేశాల్లో ఉన్న హిజ్బుల్లా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగా యని ఇజ్రాయెల్ రక్షణ దళాలు (ఐడీఎఫ్) కూడా తెలిపాయి.

ఇజ్రాయెల్ యుద్ధం నడుమ లెబనాన్‌లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు మృతి చెందాడు. రెండు రోజుల క్రితమే ఇజ్రాయెల్ దాడుల్లో లెబనీస్ జర్నలిస్టులు, వైద్య సిబ్బం ది మరణించిన విషయం తెలిందే. అయితే దక్షిణ లె బనాన్‌లో ఆదివారం రాత్రికి రాత్రే ఒక ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు మరణించ డం సోమవారం తీవ్ర ఖండనకు గురైంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో లెబనాన్‌లో మృతుల సంఖ్య 1,200 దాటిం ది. తా జా గణాంకాల ప్రకారం, ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు లెబనాన్‌లో మృతుల సంఖ్య 1,238కి పెరిగింది. 

కువైట్‌లో విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాలపై దాడి.. భారతీయుడు మృతి

కువైట్‌లోని విద్యుత్, నీటి శుద్ధి కర్మాగారాలపై ఇరాన్ దాడికి పాల్పడింది. ఈ ఘటనలో భారత్‌కు చెందిన ఓ కార్మికుడు మృతిచెందాడు. ఈ మేరకు కువైట్ మంత్రి త్వ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణి దాడి కారణంగా విద్యుత్, నీటిశుద్ధి కార్మాగారం వద్ద ఓ సర్వీస్ భవనం దెబ్బతిందని కువైట్ అధికారులు తెలిపారు. అయితే, ఈ ప్లాంట్ ఏ ప్రాంతంలోనిదో మాత్రం బయట పెట్టలేదు. గత 24 గంటల్లో 11 క్షిపణులను, 27 డ్రోన్లను అడ్డుకున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన రక్షణ మంత్రిత్వ శాఖ ద్వారా తెలిపింది.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుం చి తమ బలగాలు మొత్తం 1,941 డ్రోన్లను, 440 క్షిపణులను ఎదుర్కొన్నాయని వెల్లడించింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 178 మంది గాయపడగా, 8 మంది మరణించినట్లు కూడా పేర్కొంది. గత 24 గంటల్లో ఐదు క్షిపణులను, ఒక డ్రోన్‌ను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు జోర్డాన్ సైన్యం తెలిపింది. ఈ దాడుల్లో ధ్వంసమైన శకలాలు నేలపై పడటంతో ఒక మహిళ గాయపడినట్లు సైన్యం తెలిపింది. బీట్ లీఫ్ పట్టణంలోని ఒక ఇంట్లో ఉన్న ఇజ్రాయెల్ దళంపై గైడెడ్ క్షిపణితో దాడి చేసినట్లు, దీనివల్ల మరణాలు, గాయాలు సంభవించినట్లు హిజ్బు ల్లా పేర్కొంది.

ఇరాన్ క్షిపణి దాడి తర్వాత హైఫా చమురు డిపోలో అగ్నిప్రమాదం జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. ఇరాక్ సరిహద్దు సమీపంలో డ్రోన్ దాడులు జరిగినట్లు సిరియా నివేదించింది, చాలా వరకు అడ్డుకున్నారు. మొహమ్మద్ అలా వైమానిక స్థావరంపై రాకెట్ల దాడి జరిగిందని, దాని ఫలితంగా అక్కడ ఉన్న విమా నాలు ధ్వంసమయ్యాయని ఇరాక్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 

కొత్త వైమానిక ముప్పులో 5 డ్రోన్లను సౌదీ అరేబియా అడ్డుకుంది. లెబనీస్ సాయుధ సంస్థ హిజ్బుల్లా సోమవారం, తమ యోధులు ఇజ్రాయెల్‌పై రెండు వేర్వేరు దాడులలో డోవెవ్ గ్రామం, ఘజార్‌లోని ఒక స్థావరంపై రాకెట్లను ప్రయోగిం చారని తెలిపినట్లు అల్ జజీరా నివేదించింది. సోమవారం ఉదయం బాగ్దాద్‌లోని భారీ పేలుళ్లు సంభవించాయి. అయితే, ఇవి డ్రోన్ల వల్ల కాకుండా, రాజధానికి పశ్చిమాన సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా విక్టరీ బేస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రయోగించిన రాకెట్ల వల్ల సంభవించాయి.

వైమానిక రక్షణ వ్యవ స్థ ఈ క్షిపణులను అడ్డుకోవడంలో విఫలమైందని, వాటిలో ఒకటి ఏ32బీ ఇరాకీ రవాణా విమానాన్ని ఢీకొనడంతో అది మం టల్లో చిక్కుకుందని సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న మధ్యప్రాచ్య యుద్ధంలో విక్టరీ బేస్‌పై దాడి జరగడం ఇదే మొదటిసారి. అయితే, అమెరికా అప్పటికే ఆ స్థావరాన్ని ఖాళీ చేయడం తో, అక్కడ ఏ అమెరికన్ సైనికులు కూడా లేరు.