31 March, 2026 | 3:34 AM

ట్రంప్ లక్ష్యం యురేనియం!?

31-03-2026 01:26 AM

ఇరాన్‌లో 400 కిలోల యురేనియం సీజ్‌కు ప్లాన్

అందుకే భూతలదాడులకు సిద్ధమవుతున్న అగ్రరాజ్యం

అత్యంత రిస్క్ అంటున్న మాజీ సైనికాధికారులు

వాషింగ్టన్, మార్చి 30: ఇరాన్‌లో ఉన్న యురేనియమే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యూహం పనునతున్నట్లు తెలుస్తుంది. ఆ దేశంలోని సుమారు 400 కిలోల యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికే అగ్రరాజ్యం గ్రౌండ్ ఆపరేషన్‌కు సిద్ధమైనట్లు కన్పిస్తుంది. అందుకే ఇరాన్‌లో భూతల దాడులకు దిగాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ - ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం 31వ రోజుకు చేరుకుంది.

ప్రజల వ్యతిరేకత, రాజకీయ ఒత్తిళ్లు, ఆర్థిక నష్టాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ యుద్ధం నుంచి వెనక్కు తగ్గారు. ఇరాన్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం అయ్యారు. అయితే, అమెరికా తో చర్చలు జరిపేందుకు ఇరాన్ సుముఖత వ్యక్తం చేయటం లేదు. ఈ మేరకు ఇరాన్ నాయకులు బాహటంగానే ప్రకటనలు ఇ చ్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్ ఇకపై న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయకుండా ఉండేలా మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు.

న్యూక్లియర్ ఆయుధాలు తయారు చేయడానికి ఇరాన్ సిద్ధం చేసిపెట్టుకున్న దాదాపు 970 పౌండ్ల(400కేజీలు) యురేనియాన్ని స్వాధీ నం చేసుకోవాలని చూస్తున్నారు. ఇరాన్ దగ్గర 60 శాతం హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియం 400 కేజీలు ఉంది. 20 శాతం ఫిస్త్స్రల్ మెటీరియల్ 200 కేజీలు ఉంది. 60 శాతం హైలీ ఎన్‌రిచ్డ్ యురేనియంను ట్రంప్ టార్గెట్ చేశారు. అమెరికాకు చెందిన ఓ ప్రముఖ మీడియా కథనం ప్రకారం.. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ మెటీరియల్ ఉండకూడదని ట్రంప్ భావిస్తున్నారు. ఇరాన్‌తో చర్చలు జరిపి యురేనియాన్ని తీసుకోవాలని చూస్తున్నారు.

ఇరాన్ తమ ప్రతిపాదనకు అంగీక రించకపోతే.. బలవంతంగానైనా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలని ట్రంప్ చూస్తున్నారు. అయితే పాకిస్థాన్ వేదికగా ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దౌత్యవేత్తల మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి, ఒకవేళ అన్నీ సజావుగా సాగితే అమెరికా తన భూతల దాడి ప్లాన్‌ను విరమించే అవకాశాలు ఉన్నాయి. ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ దీవిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనలో అమెరికా ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇరాన్‌లో ఎన్నో కీలకమైన టార్గెట్లను ధ్వంసం చేశామని, తమ మిలిటరీ ఆ పని చేసినట్లు ఆయన తన ట్రూత్ సోషల్ పోస్టులో వెల్లడించారు.

తమ సైన్యం ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైందని, చాలా ప్రమాదకరమైందని, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పారు. మరోపక్క ఇరాన్ దగ్గర ఉన్న యురేనియాన్ని స్వాధీనం చేసుకోవాలన్న ట్రంప్ ఆలోచన ప్రమాదకరమైనదని అమెరికాకు చెందిన మాజీ సైనికాధికారులు అంటున్నారు. ఒకవేళ అమెరికా యురేనియాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళితే ఇరాన్ నుంచి మరింత ఉధృతంగా దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చర్యల వల్ల యుద్ధం మరిన్ని రోజులు కొనసాగుతుందే తప్ప ఆగదని స్పష్టం చేస్తున్నా రు. ట్రంప్ ప్లాన్ తీవ్ర ప్రమాదంతో కూడుకున్నదని, దానికి రోజులు, వారాల సమ యం తీసుకునే అవకాశం ఉందంటున్నారు.